ఇప్పటికి డిగ్రీ చేతికొచ్చింది

Shah Rukh Khan Takes His Graduation Degree After 28 Years

11:06 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Shah Rukh Khan Takes His Graduation Degree After 28 Years

కాలేజీ చదువుకునే రోజులు నిజంగా హ్యాపీ డేసే... అలాంటి రోజులు మళ్ళీ రావని మదన పడేవారు ఎక్కువే. అయితే బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ కి మళ్ళీ ఆపాత రోజులు వచ్చాయి. తాను చదివిన కాలేజి కి వెళ్లి డిగ్రీ పట్టా అందుకుని మరీ వచ్చాడు. అది కూడా ఏకంగా డిగ్రీ పూర్తి చేసిన దాదాపు 28ఏళ్ల తర్వాత కావడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. డిల్లీలోని హన్స్‌రాజ్‌ కాలేజీ నుంచి ఆయన మంగళవారం తన గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకున్నాడు. 1988లో తాను ఈ కాలేజీ నుంచి బయటకొచ్చానని.. ఇన్నేళ్ల తర్వాత క్యాంపస్‌లో అడుగుపెడుతుంటే చాలా సంతోషంగా ఉందంటూ షారూఖ్ తెగ ఆనంద పడిపోయాడు. మళ్లీ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నట్లు తెల్పాడు. షారూఖ్‌ స్వస్థలం డిల్లీ. సెయింట్‌ కొలుంబా స్కూల్‌లో విద్యనభ్యసించాడు, హన్స్‌రాజ్‌ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు

హన్స్‌రాజ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. ఓ సూపర్‌ స్టార్‌ తమ కళాశాల పూర్వ విద్యార్థి అవడం గర్వంగా ఉందన్నారు.

English summary

Bollywood Badshah king khan Shah Rukh Khan finally receives graduation degree from Hansraj College after 28 years.On this occassion he said This is a very special moment for me. I am back in my college, which I left in 1988. I am missing only one thing — my children are not with me today, as I wanted to show them every corner of my college.