బికినీలో కూతురు ఫోటో ... దారుణం అంటున్న షారుఖ్

ShahRukh breaks his silence on Suhana bikini picture

11:35 AM ON 4th July, 2016 By Mirchi Vilas

ShahRukh breaks his silence on Suhana bikini picture

బాలీవుడ్ హీరో షారుక్ ఒకింత అసహనానికి లోనయ్యాడు. తన ముద్దుల కూతురు సుహాన బికినీతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించిన షారుక్.. సుహాన వయసు 16 ఏళ్లు అని, అదీ.. బీచ్ లో తన తమ్ముడు అబ్ రామ్ తో కలసి ఆడుకుంటున్నప్పటి ఫొటో అని చెబుతూ దీనిపై వివాదం చేయడం సరికాదని అంటున్నాడు.

షారుక్ కూతురు బికినీలో తన బాడీని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యలు చేయడం సభ్యతకాదని షారుఖ్ అంటున్నాడు. సుహాన ఇంకా చిన్నపిల్లని, ఆమె బికినీ ఫొటోలను పోస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించాడు. సుహానె ఫొటో వైరల్ కావడానికి తన స్టార్ డమ్ కారణమని, ఆమె తన కూతురు కాకపోయింటే వార్త అయ్యేదికాదని షారుక్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో నుంచి ఆ ఫొటోను తొలగించాలని కోరుతున్నాడు.

ఇది కూడా చూడండి: హీరోలు వారి పిల్లలు

ఇది కూడా చూడండి: టాలీవుడ్ లో వీళ్ళు వీళ్ళు రిలేటివ్స్ అని మీకు తెలుసా

ఇది కూడా చూడండి: మన హీరోలు - హైక్లాస్ ఇళ్ళు

English summary

Bollywood ShahRukh breaks his silence on Suhana bikini picture.