షారుఖ్ ఖాన్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా?

Shahrukh Khan properties details

03:11 PM ON 7th May, 2016 By Mirchi Vilas

Shahrukh Khan properties details

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోస్ లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. 1989 టీవీ సీరియల్ ద్వారా నట ప్రస్ధానం ప్రారంభించిన షారుఖ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. సినిమాల్లో అవకాశాలు కోసం స్టూడియోకి వెళ్ళడానికి తన స్నేహితుడు దగ్గర 20 రూపాయలు తీసుకుని వెళ్ళిన షారుఖ్ ఇప్పుడు ఎన్ని వేల కోట్లు సంపాదించాడో తెలిస్తే షాక్ అయ్యి తీరాల్సిందే.. షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ అక్షరాలా 600 మిలియన్ డాలర్లు. అంటే 3979,19,70,000(అక్షారాలా 39 వేల కోట్లు రూపాయలు).

ఇది కూడా చదవండి: శృంగార పార్క్ గురించి ఎప్పుడైనా విన్నారా?!

ప్రపంచ నటుల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో షారుఖ్ ది రెండో స్ధానం అని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఓ నటుడు ఈ రకంగా సంపాదించడం నమ్మశక్యం కాని విషయమే. కాని షారుఖ్ తో అత్యంత సన్నితంగా ఉండే వాళ్లకు మాత్రం ఆశ్చర్యం ఏమీ కలగదు. ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ 1 నటుడుగా విరజల్లుతున్న షారుఖ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడు. అంతే కాదు ఎన్నో యూనివర్సిటీలు నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించాడు. సినిమాలు కంటే హీరోలు యాడ్స్ ద్వారా ఎక్కువ సంపాదించవొచ్చని నిరూపించింది ముందు షారుఖ్ ఖానే.. సినిమాల్లోకంటే షారుఖ్ యాడ్స్ లోనే ఎక్కువ కనిపిస్తాడు.

ఇది కూడా చదవండి: ఒకపక్క ఇంట్లో నాన్న శవం.. అయినా క్రీజులో కోహ్లీ!

ఇకపోతే షారుఖ్ కి ఉన్న వ్యాపారాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు ఐపీఎల్ టీం ద్వారా ఏట కోట్లు వేనుకేస్తుంటే, మరోవైపు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా 100 కోట్లు వేనుకేసాడు. షారుఖ్ చేసే వ్యాపారాల విలువ, ఇతర ఆదాయాలన్నీ లెక్కగడితే షారుఖ్ ఆస్తి విలువ దాదాపు 40 వేల కోట్లు పై మాటే. ప్రస్తుతం షారుఖ్ రాయిస్ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..

ఇది కూడా చదవండి: సీక్రెట్ ప్లేసులో 'ఓం' టాటూ వేయించుకున్న పాప్ సింగర్!

English summary

Shahrukh Khan properties details. Shahrukh Khan properties and business income values are upto 600 million dollars(40,000 thousand crores).