ఆ పాటతో బాద్ షా రీఫ్రెష్‌ అయ్యాడా!

Shahrukh Khan Refreshed With Kapoor And Sons Song

10:53 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Shahrukh Khan Refreshed With Kapoor And Sons Song

నటులు సిద్ధార్థ్‌ మల్హోత్రా, అలియాభట్‌, ఫవాద్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించిన ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’. చిత్రంలో ఓ పాట బుధవారం విడుదలైంది. మార్చి 18న ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి షకున్‌ బత్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విడుదలైన ‘లెట్స్‌ నాఛో’ పాటను చూసి బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రీఫ్రెష్‌ అయ్యాడట. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ, సదరు పాటలోని ఓ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నాడు. చిత్ర బృందానికి అభినందనలు కూడా తెల్పాడు. కాగా షారుక్‌, అలియాభట్‌లు జంటగా గౌరి షిండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్‌ ఇటీవల గోవాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

English summary

Bollywood king Khan Shah Rukh Khan said that he was so refreshed by watching Kapoor And Sons song which was acted by Alia Bhat,Sidharth Malhotra and Fawad Khan.He wished the whole team of Kapoor and Sons with a post in his Twitter Account.