సీరియల్‌ రీమేక్‌ లో షారుక్‌

ShahRukh Khan To Remake Breakingbad Serial

04:06 PM ON 15th December, 2015 By Mirchi Vilas

ShahRukh Khan To Remake Breakingbad Serial

బాలీవుడ్‌ హీరో కింగ్‌ఖాన్‌ షారుక్‌ఖాన్‌ ఒక ప్రముఖ ఇంగ్లీషు సీరియల్‌ 'బ్రేకింగ్‌ బ్యాడ్‌ 'అనే సీరియల్‌ ను హిందీలో సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట, ఈ విషయాన్ని స్వయంగా షారుక్‌ఖాన్‌ ఒక ఇంటర్వూ లో తెలిపాడు.

మాఫియా, డ్రగ్స్‌ కధాశంగా జరిగే ఈ సీరియల్‌ ను ఇండియాలో రీమేక్‌ చేస్తే అలాంటి సీరియల్‌ ను భారత ప్రజలు చూడరని, అందుకే సీరియల్‌ రూపంలో కాకుండా సినిమా రూపంలో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపాడు.

2008 వ సంవత్సరంలో మొదలైన ఈ సీరియల్‌ సిరీస్‌ ఇప్పటి వరకు ఐదు అద్భుతమైన భాగాలుగా వచ్చి అందరిని ఆకట్టుకుంది. ఈ సీరియల్‌ లోని ప్రధాన పాత్రలో షారుక్‌ నే నటించనున్నట్లు సమాచారం.

తాజాగా షారుక్‌ఖాన్‌, కాజల్‌ కాంబినేషన్లో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన దిల్‌వాల్‌ సినిమా ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తాలుకు ప్రమోషన్ కార్యక్రమాలలో షారుఖ్ బిజీగా ఉన్నాడు.

English summary

The Bollywood superstar Shahrukh Khan has revealed in an interview that he has been waiting to remake an American TV show Breaking Bad to the Indian audiences