'సైతాన్' గా వస్తున్న 'బిచ్చగాడు'

Shaitan movie poster

04:29 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Shaitan movie poster

తెలుగులో ఇప్పుడు డబ్బింగ్ సినిమాలంటే ఓ రకమైన టెన్షన్ మొదలైంది. డబ్బింగ్ సినిమా అని, చిన్నహీరో అని నిన్నటివరకు ఇతర భాషా సినిమాలను తక్కువగా అంచనా వేశారు. అయితే కథ, కథనం కొత్తగా ఉంటే తెలుగు ప్రేక్షకుడు ఆదరిస్తాడన్న సత్యాన్ని పరభాషా సినీ పరిశ్రమ తెలుసుకోవడంతో ఇప్పుడు వరస పెట్టి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. ఆకోవలోనే ఇప్పుడు టాలీవుడ్ కి టెన్షన్ పెడుతున్న ఆ హీరో సినిమా మరొకటి రాబోతోందట. అతనే విజయ్ ఆంటోని. డాక్టర్ సలీమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ తరువాత బిచ్చగాడు అంటూ మరో సినిమాతో వచ్చాడు.

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో పోటీపడీ మరీ రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ. 20 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు రావడంతో ఇప్పుడు విజయ్ ఆంటోని సినిమాలకు టాలీవుడ్ లో గిరాకీ పెరిగింది. త్వరలో ఆయన నటిస్తున్న సైతాన్ తెలుగు రైట్స్ ను నిర్మాత ఎస్. వేణుగోపాల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రదీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అరుంధతి నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.

English summary

Shaitan movie poster