గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న షకలక శంకర్

Shakalaka Shankar married secretly in Arasavalli temple

10:58 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Shakalaka Shankar married secretly in Arasavalli temple

ఈటీవి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ ఆ తరువాత సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా సంపాదించుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో కుదిరితే కప్పు కాఫీ చిత్రంతో కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన శంకర్ ఆ తరువాత వరుస పెట్టి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు టాప్ కమెడియన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంచితే షకలక శంకర్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శ్రీకాకుళం అరసవల్లిలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా శుక్రవారం రాత్రి షకలక శంకర్ పెళ్లి జరిగింది. శంకర్ తన మేనమామ కూతురు అయిన పార్వతిని పెళ్లి చెసుకున్నాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షకలక శంకర్.. తన తండ్రి మొక్కు కారణంగా అరసవల్లిలో పెళ్లి చేసుకోగా, సహచర నటులెవరినీ ఆహ్వానించలేదన్నారు. సూర్యనారాయణ స్వామి సన్నిధిలో కల్యాణ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం కంటే.. సేవా కార్యక్రమాల పై తన దృష్టి ఉందన్నాడు. నేను పుట్టిన గెడ్డ రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నాడు. మరోవైపు ‘సర్దార్ గబ్బర్‌ సింగ్’ సెట్‌లో ఈ కమెడియన్‌ వ్యవహార శైలి పై పవన్ క్లాస్ పీకినట్లు అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షకలక శంకర్ మళ్లీ కనిపించలేదు. షకలక శంకర్ కి ఏమైందో అనుకున్నారంతా.. కానీ అసలు విషయం ఇది. తాజాగా ఇలా పెళ్లి చేసుకుని మీడియా ముందు ఇలా ప్రత్యక్షమయ్యాడు.

English summary

Shakalaka Shankar married secretly in Arasavalli temple. Comedian Shakalaka Shankar married his uncle's daughter Parvathi in Srikakulam Arasavalli temple.