షేక్‌స్పియర్‌ పుర్రెను ఎత్తుకు పోయారు?

Shakespeares Skull Stolen

11:09 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Shakespeares Skull Stolen

ఆంగ్ల నాటక రంగాన్నే కాదు ప్రపంచ నాటక రంగంలోనే ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ప్రముఖ నాటక రచయిత షేక్‌స్పియర్‌ ఎప్పుడో చనిపోయాడు కదా. ఇప్పుడు పుర్రెను ఎవరో ఎత్తు కెళ్ళడం ఏమిటి అనే సందేహం రావడం సహజం. కానీ నిజంగా ఎవరో ఆ పుర్రెను పట్టుకు పోయారు. ఇటీవల లండన్‌ హోలీ ట్రినిటీ చర్చ్‌లో ఉన్న ఆయన సమాధిని పరిశీలించినపుడు తమకీ విషయం తెలిసిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన కెవిన్‌ కలిస్‌ మాట్లాడుతూ, శక్తిమంతమైన పరికరాలతో సమాధిని స్కానింగ్‌ చేసినపుడు షేక్‌స్పియర్‌ పుర్రె ప్రాంతంలో ఖాళీ ఉందని తేలినట్లు వివరించాడు. దీన్నిబట్టి చూస్తే షేక్‌స్పియర్‌ పుర్రెను ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని ఆయన అంటుంటే, హోలీ ట్రినిటీ చర్చ్‌ పెద్దలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి వదంతులను లేవనెత్తడం మంచిది కాదని హెచ్చరించారు. చోరీ ఆరోపణల నేపథ్యంలో సమాధిని తవ్వే ప్రయత్నమేదీ చేయబోమని చర్చ్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. మనుషులను, వస్తు వాహనానాలు మాత్రమే కాదు సమాధుల్లో ఉన్న మనిషి శరీర భాగాలు కూడా ఎత్తుకెళ్ళి పోతున్నారంటే ఏమనాలి .. ఎవరిని అనాలి ..

టెన్నీస్‌ బంతులతో వేడి పుట్టిస్తున్న మోడల్‌(వీడియో)

పెళ్లి అయిన ఇంట .. పెను విషాదం ..

ఇండియా అభిమానులకు విరాట్ భలే బుద్ధి చెప్పాడు

ఫస్ట్‌నైట్‌ కు బెస్ట్‌ చిట్కాలు

English summary

Worlds Popular Writer Shakespeare skull has stolen by some one. One the researcher named Kalis found that there was no skull in his Grave.