పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టార్ క్రికెటర్ దంపతులు

Shakib Al Hasan And Wife Escaped From Helicopter Crash

10:40 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Shakib Al Hasan And Wife Escaped From Helicopter Crash

ఈ మధ్య రోడ్డు, రైల్ మార్గాల్లోనే కాదు ఆకాశ మార్గంలో కూడా ప్రమాదాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఆకాశ మార్గంలో పెను ప్రమాదం నుంచి ప్రముఖ స్టార్ క్రికెటర్ దంపతులు తప్పించుకున్నారు. వాళ్ళను అలా దింపిన కొద్ది క్షణాల్లోనే హెలీకాఫ్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే,...

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హాసన్, అతని భార్య ఉమ్మే అహ్మద్ షిషిర్ లను కాక్స్ బజార్ లోని రాయల్ టులిప్ సీ రిసార్ట్స్ వద్ద దింపిన హెలీకాఫ్టర్ తిరుగు ప్రయాణంలో కుప్పకూలిపోయింది. అయితే ఇక్కడ ముఖ్య విషయమేమంటే షకీబుల్ హాసన్ దంపతులను దింపిన ప్రాంతానికి ఒకటిన్నర్ర కిలోమీటర్ల దూరంలోనే ఆ హెలీకాఫ్టర్ కూలిపోయింది. ఆ సమయంలో హెలీకాఫ్టర్ లో మొత్తం ఐదుగురు ఉండగా ఒకరు మరణించారు. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. షకీబుల్ హసన్ నటించాల్సిన ఒక వాణిజ్య ప్రకటన కోసం ఉదయం 9.30 గంటల సమయంలో దంపతులను హెలకాఫ్టర్ లో డ్రాప్ చేశారు. అయితే ఈ ఘటన వెంటనే స్పందించిన షకీబుల్ హాసన్, ప్రమాద వార్త విని తాను షాక్ కు గురైనట్టు తెలిపాడు. తనకు ఏమీ కాలేదని తాము క్షేమంగా ఉన్నామని ప్రకటన చేసి అభిమానుల ఆందోళనకు తెర దించాడు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:బుద్ధుని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఇవి కూడా చదవండి:భార్యపై అనుమానంతో తల నరికి వీధుల్లో ఊరేగించాడు.. ఆపై..

English summary

Bangladesh Cricketer and Worlds Top list Cricketer Al Rounder Shakib Al Hasan and his wife Umme Ahmed Shishir narrowly escaped from a Helicopter crash. The helicopter just dropped the couple and it was crashed from just 1.5 kilometer distance from it dropped. Shakib Al Hasan said that he was shocked by that and he said that he was safe over there. One was died in this accident and some were suffering with severe injuries.