మరోసారి కనిపించబోతున్న శక్తి మాన్

Shaktimaan to return back on TV

11:54 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Shaktimaan to return back on TV

శక్తిమాన్‌.. ఈ భారత సూపర్‌ హీరో పేరు విననివారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్న శక్తిమాన్‌ మళ్లీ బుల్లితెరపై కన్పించ బోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారత సూపర్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శక్తిమాన్‌ ధారావాహిక తొలిసారిగా 1997లో దూరదర్శన్‌లో ప్రసారమైంది. 2005 వరకు ఈ సీరియల్‌ కొనసాగింది. కేవలం హిందీలోనే కాకుండా.. పోగో ఛానల్‌లో ఇంగ్లిష్‌, మరికొన్ని స్థానిక ఛానళ్లలో ఒరియా, తమిళ భాషల్లోనూ ప్రసారమైంది. ప్రముఖ నటుడు ముఖేశ్‌ ఖన్నా ఈ సీరియల్‌ను నిర్మించడమే గాక.. స్వయంగా శక్తిమాన్‌ పాత్రలో నటించారు. ఇప్పుడు మళ్ళీ అలరించనుందని అంటున్నారు. త్వరలోనే శక్తిమాన్‌ సీరియల్‌ను తిరిగి ప్రారంభించనున్నారట. ఇందుకోసం కొన్ని ఛానళ్లతో ప్రముఖ నటుడు ముఖేశ్‌ ఖన్నా ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఏ రోజు వస్తుందనైతే చెప్పలేం కానీ.. త్వరలోనే శక్తిమాన్‌ మరోసారి బుల్లితెర మీదకు రాబోతోందని ముఖేశ్‌ చెబుతున్నారు. కొత్తగా సిక్స్‌ ప్యాక్‌ శరీరంతో కాకుండా..15ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో అలాగే కన్పిస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఉజ్జయిని కుంభమేళా - పోటెత్తిన భక్తజనం

ఎఫ్ బి ఖాతాలు తొలగించమంటూ ముస్లిం మహిళలకు ఆంక్షలు

పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

English summary

We all know well about the Indian Hero Shaktimaan which was attrated by many of the Indians . Now this serials was going to return again in Indian TV Channels this was said by the Shaktimaan Actor Mukesh Khanna.