ఆడవాళ్లు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయరో తెలుసా?

Shall women can do Sashtang Pranam

11:39 AM ON 30th September, 2016 By Mirchi Vilas

Shall women can do Sashtang Pranam

మనం గుళ్ళోకి వెళ్లినా, ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకున్నా సాష్టాంగ నమస్కారం చేయడం రివాజు. గురువులకు నమస్కారం కూడా అలానే చేస్తుంటారు. అయితే మగవాళ్లే ఇలా చేస్తారు, ఆడవాళ్లు చేయరు. దానికి ఓ కారణం వుంది. సాష్టాంగం అంటే స అష్టాంగం అంటే ఎనిమిది అవయవాలతో చేసే నమస్కారం. అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు. సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్ళు, కన్నులూ నేలకు ఆన్చి నమస్కరించాలి. కానీ స్త్రీ ఉదరం గర్భాశయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సాష్టాంగం వల్ల అది ఒత్తిడికి గురవుతుంది.

దాని వల్ల గర్భ స్రావాలు అవ్వడం, మరే ఇతర ఇబ్బందులైనా జరిగే ప్రమాదం ఉంది. అటువంటిది జరగకుండా స్త్రీలను సాష్టాంగ నమస్కారం చేయవద్దంటారు. స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించాలి. లేదా నడుమును వంచి నమస్కరించవచ్చు. స్త్రీలు పంచాంగ నమస్కారాన్ని అంటే కాళ్ళు, చేతులు నుదురు మాత్రమే తాకేలా నమస్కరించడం చేయాలి. అదీ సంగతి..

English summary

Shall women can do Sashtang Pranam