శంకర్ దయాళ్ వద్దన్నాకే పీవీ వైపు మొగ్గు

Shankar Dayal Sharma rejected the post

04:21 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Shankar Dayal Sharma rejected the post

'1991: హౌ పీవీ మేడ్ హిస్టరీ' పేరిట సంజయ్ బారు కొత్త పుస్తకం వచ్చింది. అందులో సోనియా గాంధీ ఏవిధంగా పివి నరసింహారావు వైపు మొగ్గాల్సి వచ్చిందో, ఎందుకు పట్టం కట్టిందో వివరించారు. తాను స్వయంగా ప్రధాని కాలేని అసహాయత నేపథ్యంలో... సోనియాగాంధీ మరొకరికి ఆ పదవి అప్పగించాల్సి వచ్చింది. అయితే ఇందుకోసం చాలా కసరత్తే జరిగింది. సోనియా గాంధీ కుటుంబ విధేయుల మద్దతువల్లే శరద్ పవార్, అర్జున్ సింగ్ తదితరులకంటే రేసులో పీవీ ముందు నిలిచారు. వారు పీవీ వైపు మొగ్గు చూపడానికి చాలా కారణాలుండొచ్చు. వారి దృష్టిలో... పీవీ ఏం చెప్పినా చిత్తం అని అంటారు. ఓ రబ్బరు స్టాంపులా వ్యవహరిస్తారు.

పైగా... అప్పటి రాజకీయాల్లో ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు! వయసు మీద పడిన వృద్ధుడు అని సంజయ్ బారు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే... సోనియా ఆ సమయంలో మరో ఆలోచన కూడా చేశారట! అప్పట్లో ఉప రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మను ప్రధానిని చేయాలని సోనియా భావించారు. అయితే, తన ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదంటూ శంకర్ దయాళ్ ఈ ఆఫర్ ను తిరస్కరించారు అని నట్వర్ సింగ్ ను ఉటంకిస్తూ తెలిపారు. ఆర్థికంగా, రాజకీయంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆర్థిక మంత్రి ఎంపిక కీలకంగా మారింది. మన్మోహన్ సింగ్ ఎంపిక వెనుక ఎంత కసరత్తు జరిగిందో కూడా సంజయ్ బారు తన పుస్తకంలో వివరించారు. దీని ప్రకారం... ప్రధాని అయిన తొలి రోజుల్లో పీసీ అలెగ్జాండర్ పై(ఇందిరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు) ఎక్కువగా ఆధారపడ్డారు.

1/4 Pages

ప్రణబ్ పేరు...


ప్రస్తుతం రాష్ట్రపతిగా వున్న ప్రణబ్ ముఖర్జీని అప్పట్లో ఆర్థిక మంత్రిగా నియమించాలంటూ ఆయన సన్నిహితులు పీవీపై ఒత్తిడి తెచ్చారు. అయితే, అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక ఆర్థిక వేత్తను, నిపుణుడిని ఆర్థిక మంత్రిగా నియమించాలని నిర్ణయించుకున్నారు. పలువురి పేర్లు పరిశీలించారు.

English summary

Shankar Dayal Sharma rejected the post