రోబో2 తర్వాత మళ్ళీ విక్రమ్‌తోనే!!

Shankar New movie with Vikram and Vijay

07:53 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Shankar New movie with Vikram and Vijay

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ తాజాగా తెరకెక్కించబోతున్న చిత్రం రోబో-2. 2010లో రజనీకాంత్‌ నటించిన రోబో చిత్రానికి ఇది సీక్వెల్‌. ఇది ఇంకా సెట్స్‌ పైకి వెళ్ళకముందే తాజాగా శంకర్‌ వేరే కొత్త సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్‌తో అపరిచితుడు, ఐ వంటి రెండు చిత్రాలు శంకర్‌ చేశారు. తాజాగా శంకర్‌ విజయ్‌, విక్రమ్‌లతో ఒక బిగ్‌ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన స్టోరీ లైన్‌ కూడా ఇద్దరు హీరోలకు వినిపించాడని సమాచారం. దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్‌ చేయాలని కొన్ని రైటర్స్‌కు శంకర్‌ చెప్పారట.

మామూలుగా ఈ చిత్రాన్ని రోబో-2 కు ముందే తెరకెక్కించాలనుకున్నారు శంకర్‌. కానీ 'ఐ' ఫ్లాప్‌ అవ్వడంతో రోబో-2 కి షిఫ్ట్‌ అయ్యారు శంకర్‌. అన్నీ అనుకున్నట్టు జరిగితే శంకర్-విక్రమ్-విజయ్ కాంబినేషన్‌ 2019లో సెట్స్‌పైకి వెళ్తుంది.

English summary

Shankar New movie with Vikram and Vijay after completion of Robo-2.