'ఐ' వెనుక అసలు రహస్యం బయట పెట్టిన శంకర్

Shankar revealed the success behind the I movie

01:17 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Shankar revealed the success behind the I movie

కొన్ని సినిమాలు అర్ధవంతంగా ఉంటే, మరికొన్ని జొప్పించినట్లు ఉంటాయి. కానీ దర్శకుడు శంకర్ సినిమాలు అర్ధవంతంగానే ఉంటాయి, పైగా వెరైటీ ఉంటుంది. ఆ పాత్ర ఎంత కష్టమైనా సరే వేయడానికి నటులు ఇష్టపడతారు. ఇక శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'ఐ' సినిమా గత సంవత్సరం సంక్రాంతి కానుకగా భోగి పండుగ రోజున రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉన్న కీలక పాత్రలు కొన్నే అయినా, అందరిలోకీ అత్యధికంగా శ్రమించిందీ, ఎక్కువ మార్కులు కొట్టేసిందీ మాత్రం నిస్సందేహంగా విక్రమే. ఎందుకంటే, కండలు తిరిగిన బాడీ బిల్డర్ గా, ఆ వెంటనే అందమైన నాజూకు మోడల్ గా, అటు వెంటనే కండలు కరిగిపోయి - ఒళ్ళంతా వికృతంగా తయారైన గూనివాడిగా విభిన్న ఛాయలున్న పాత్రను విక్రమ్ పోషించాడు.

ఇన్ని రకాల విభిన్నమైన పాత్రలో వేర్వేరు షేడ్స్ లోనూ అతడు అచ్చంగా అతికినట్లు సరిపోవడమే కాక, ఆ పాత్రకు జీవంపోశాడు. ఒక్క హీరో పాత్ర అనే కాదు... విలన్ల పాత్రలు కూడా విభిన్నంగా ఉన్నాయి. అన్ని పాత్రలూ సన్నివేశాలకు అతికినట్లు సరిపోవడానికి కారణం వెటా మేకప్ డిపార్టుమెంట్. జాన్సన్ దోచెర్తీ, లుకే హాకర్, సిమాన్ థామస్ రోస్, వారెన్ డియోన్ స్మిత్, మైక్ అస్కైత్, డేనియల్ కాకర్సెల్, కిమ్ దోచెర్తితో కూడిన వెటా వర్క్ షాప్ కృషే ఐ మూవీ అంతబాగా రావడానికి కారణమని దర్శకుడు శంకర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. వెటా వర్క్ షాపులో ఆర్టిస్టులను పాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఫొటోలను కూడా షేర్ చేసాడు. మీరు ఓ లుక్కెయ్యండి.

1/22 Pages

English summary

Shankar revealed the success behind the I movie. Star director Shankar revealed the success behind the I movie makeup.