ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

Shankaracharya Swaroopananda Sensational Comments

10:00 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Shankaracharya Swaroopananda Sensational Comments

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని శని సింగాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తే వారిపై రేప్ లు, ఇతర నేరాలు పెరిగిపోతాయని శంకారాచార్య స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలయ గర్భ గుడిలో మహిళలను అనుమతించవచ్చుని బాంబే హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పట్ల అనేకమంది మత గురువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ గర్భ గుడిలో స్త్రీలకు ప్రవేశం కల్పిస్తే శనీశ్వరుని కళ్ళు వారిపై పడతాయని, దీంతో దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతాయని స్వరూపానంద సరస్వతి అంటున్నారు. దాదాపు నాలుగు వందల ఏళ్ళుగా ఈ గుడిలో మహిళల ప్రవేశం పై నిషేధం కొనసాగుతోంది. మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులకు కారణం ప్రజలు షిర్డీ సాయిబాబా ను పూజించడమే అని కూడా స్వరూపానంద సరస్వతి షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎటు దిరిగి ఎటు వస్తుందో ఈ వ్యవహారం ...

ఇవి కూడా చూడండి:

రైనా కు వార్నింగ్ ఇచ్చిన శిఖర్ ధావన్

బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

సర్దార్ పై ఎన్టీఆర్ మెసేజ్ చూసి షాకైన దేవిశ్రీ

English summary

Shankaracharya Swaroopananda Made Some Sensational Comments. He says that by allowing Woman into Singapoor Temple, rapes and other criminal activities will increase.