'భలే అమ్మాయిగా 'లవ్‌లీ'

Shanvi as Bhale Ammai

11:52 AM ON 23rd December, 2015 By Mirchi Vilas

Shanvi as Bhale Ammai

నాని, లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్లుగా మారుతి తెరకెక్కించిన చిత్రం 'భలేభలే మగాడివోయ్‌'. 2015 లో చిన్న సినిమాగా విడుదలై నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్‌ వద్ద కాసులు కొల్లగొట్టింది. ఈ చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో కన్నడ-తమిళం-హిందీ భాషల నిర్మాతలు ఈ చిత్రం రీమేక్‌ పై దృష్టి పెడుతున్నారు. 'భలేభలే మగాడివోయ్‌' చిత్రం నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్‌ ఇప్పుడు ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగు వెర్షన్‌లో లావణ్య త్రిపాఠి నటించిన పాత్రలో కన్నడంలో శాన్వి నటించబోతుంది. శాన్వి మనకి కొత్తేం కాదు, ఆది హీరోగా నటించిన 'లవ్‌లీ' చిత్రంతోనే శాన్వి కెరీర్‌ ప్రారంభమయింది.

అయితే తెలుగులో సరైన అవకాశాలు రాక కన్నడకి రూటు మార్చింది. అక్కడ సరైన హిట్లు అందుకున్న శాన్వి ఇప్పుడు కన్నడలో క్రేజీ హీరోయిన్‌ గా మారిపోయింది. అల్లు అరవింద్‌ తో పాటు మరో నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ కలిసి కన్నడంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary

Shanvi Srivastava is acting as a heroine in Bhale Bhale Magadivoy kannada remake.