స్వతంత్ర ఆలోచనలున్నవారంటే సోనియాకు గిట్టదా ?

Sharad Pawar About Sonia Gandhi In His Autobiography

01:01 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Sharad Pawar About Sonia Gandhi In His Autobiography

ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో కోర్టుకి హాజారు కావాల్సి వుండడం ఓ తలనొప్పిగా మారితే , తాజాగా శరద్ పవర్ వ్యాఖ్యలు సోనియా గాంధికి ఇబ్బంది కల్గించే విధంగా ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులకు , ముఖ్యంగా సోనియా విధేయులకు మింగుడుపడడం లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి ) అధినేత, మరాఠా దిగ్గజం శరద్ పవర్ ఆత్మకథ పేరిట వెలువరించిన 'ఆన్ మై టర్మ్స్ ఫ్రం గ్రాస్ రూట్స్ టు ది కారిడార్స్ ఆఫ్ పవర్ " పుస్తకంలో అంశాలు సోనియా గాంధి నైజాన్ని బయట పెట్టారు.

'స్వతంత్ర ఆలోచనలు గల వ్యక్తిని పిఎమ్ సీట్లో కూర్చోబెడితే , ఇబ్బందులు వస్తాయని సోనియా గాంధి భావించారు. అందుకే నన్ను ప్రధానిగా చేయలేదు. పైగా నా కన్నా వయస్సులో పెద్దవాడు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పివి నరసింహారావు ని తెరమీదికి తచ్చారు. ప్రధాని రేసు నుంచి నన్ను ఆవిధంగా తప్పించారు' అంటూ పవర్ తన ఆత్మకధలో వెల్లడించారు. అంతేకాదు నేను ప్రధాని అయితే సుదీర్ఘకాలం పదవిని అంటిపెట్టుకుని ఉంటానని సోనియాకు అర్జున్ సింగ్ , ఎం ఎల్ ఫోతెదార్ , ఆర్కె ధావన్ , వి జార్జి నూరిపోసారు. ఇందులో అర్జున్ సింగ్ కి ప్రధాని కావాలని బలంగా కోరిక వుండేది ' అని పవర్ వ్యాఖ్యానించారు ఆత్మకథలో.

విశ్రాంతి తీసుకుంటున్న పివిని ప్రధానిగా ఎంపిక చేసాక ఇందిరా గాంధి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పిసి అలెగ్జాండర్ నాకు , పివికి మద్య కీలక సమావేశం ఏర్పాటు చేసి , కేబినెట్ లోని మూడు కీలక శాఖల్లో ఏదో ఒకటి తీసుకోమని సూచించారు 'అని శరద్ పవర్ తన ఆత్మకధలో పేర్కొన్నారు.

ఇక 1997లొ ఒక ఓటుతో వాజపాయి సర్కార్ కూలిన సందర్భంగా జరిగిన ఓ రహస్యాన్ని కూడా పవర్ తన ఆత్మకధలో ప్రస్తావించారు. అదేమంటే అవిశ్వాస తీర్మాన ఓటింగ్ సందర్భంగా బిస్పీ నేత మాయావతిని శరద్ పవర్ పక్కకు పిలిచి మాట్లాడ్డం. ఇంతకీ అక్కడ ఆమెతో మాట్లాడింది ఏమంటే , వాజపాయి కి వ్యతిరేకంగా వోటు చేస్తే , యూపిలో బిస్పీకి కాంగ్రెస్ పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని పవర్ ద్వారా సోనియా చెప్పించారు. దీంతో 5గురు బిస్పీ సభ్యులూ వాజపాయి సర్కార్ కి వ్యతిరేకంగా ఓటు చేసారు. ఫలితంగా ఒక ఓటు తేడాతో వాజపాయి సర్కార్ పడిపోయింది. ఆనాటి సంఘటనలను పవార్ ఈవిధంగా బహిర్గతం చేసే , పలు అంశాలు తన ఆత్మకథలో పొందుపరిచారు.

కనీసం ప్రపక్ష హోదా కూడా లేకుండా , లోకసభలో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ , కి ఇంటా బయట అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే , ఈసమయంలో పవార్ ఆత్మకథ విడుదల కావడం కూడా తలనొప్పులు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదేమో ?

English summary

Politician and Ex- Bcci president Sharad Pawar says some intresting words about AICC President Sonia Gandhi in his autobiography