డోపింగ్ లో దొరికిపోయిన రష్యా టెన్నిస్ బ్యూటీ

Sharapova Caught in Drug Test

05:29 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Sharapova Caught in Drug Test

రష్యా టెన్నిస్‌ అందం మరియా షరపోవా చిక్కుల్లో పడింది. తాజాగా షరపోవా డోపింగ్‌ టెస్ట్‌లో దొరికిపోయింది. జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ సందర్భంగా నిర్వహించిన డ్రగ్‌ టెస్ట్‌లో షరపోవా మెల్డోనియం డ్రగ్‌ తీసుకోవడంతో పాజిటివ్‌ అని తెలింది. అయితే ఈ డ్రగ్‌ తాను 2006 నుంచి తీసుకుంటున్నానని, దానిని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా తెలిపింది. డోపీగా తేలడంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 12 నుంచి తాత్కాలిక సస్పెన్షన్‌ అమలులోకి రానుంది. దీంతో ఆమె కెరియర్‌ ప్రశ్నార్థకంగా మారింది. తాను చాలా పెద్ద తప్పు చేశానని.. డోపింగ్‌ టెస్ట్‌ విఫలమవ్వడంలో పూర్తి బాధ్యత తనదే అని, తన అభిమానులను బాధపెట్టానని, నాలుగేళ్ల వయస్సు నుంచి టెన్నిస్‌ ఆడుతున్నా.. అందుకే టెన్నిస్‌ ఎంటే ఎంతో ప్రేమ అని షరపోవా పేర్కొంది. డోపీగా తేలడం పట్ల ఎదురయ్యే పరిణామాల గురించి తనకు తెలుసని, అయితే కెరీర్‌ ముగించాలనుకోవట్లేదని.. తనకు మరో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని షరపోవా ఉద్వేగానికి గురయ్యింది.

English summary

Worlds Top Tennis Player Maria Sharapova says that she failed a drug test at the Australian Open.Sharapova said that she received a letter from International Tennis Federation.The ITF confirmed the failed drug test and said Sharapova would be suspended until the case is finalized.