బ్రిస్బేన్ టెన్నిస్ టోర్నీ నుంచి షరపోవా ఔట్

Sharapova Quits From Brisbane Open

07:01 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Sharapova Quits From Brisbane Open

రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీ నుంచి వైదొలగింది. ఎడమ మోచేతి గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోనికి దిగాల్సిన షరపోవా... తన తొలి మ్యాచ్ రష్యాకే చెందిన ఎకతెరిన మకరోవాతో ఆడాల్సి ఉండగా... మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు షరపోవా పేర్కొంది. రెండు రోజుల కిందట ప్రాక్టీస్ చేస్తుండగా ఎడమ మోచేతికి గాయం అయ్యిందని వివరించిన ఆమె... ఆస్ట్రేలియా ఓపెన్ కు ముందు గాయంతో ఆడి రిస్కు తీసుకోవడం ఇష్టం లేక ఈ టోర్నీ నుంచి వైదొలగినట్ల తెలిపింది.

English summary

Tennis queen maria sharapova quits from brisbane open.The Australian Open contenders Maria Sharapova and Simona Halep withdrew from the Brisbane International after suffering injuries less than two weeks before the first grand slam of the year.