'షేర్ఇట్' దూకుడు..

SHARE IT app crosses 100 million users in India

05:56 PM ON 12th December, 2015 By Mirchi Vilas

SHARE IT app crosses 100 million users in India

ఇండియాలో ఇప్పుడు షేర్ఇట్ దూసుకుపోతోంది. ఇంటర్నెట్ లేదా డేటా ఆఫర్ తో పని లేకుండా మన ఫోన్ లో ఉన్న ఆడియో, వీడియో, యాప్, ఫైల్స్ ఏదైనా మరో ఫోన్లోకి పంపించాలంటే మనమందరిలో చాలామంది వాడే యాప్ 'షేర్ఇట్'. ఏ ఫోన్ అయినా.. ఏ సమాచారమైనా క్షణాల్లో మరో ఫోన్లోకి షేర్ చేయగలదు ఈ యాప్. ఒకప్పుడు ఉన్న బ్లూటూత్ స్థానంలోకి వచ్చేసిన ఈ యాప్‌కు స్వల్ప వ్యవధిలోనే ఆదరణ అనూహ్యంగా పెరిగిపోయింది. ఏడాదిలోనే భారత్‌లో ఈ యాప్‌ను వినియోగించేవారి సంఖ్య 100 మిలియన్లకు చేరిందంటే దీని దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఇంటర్నెట్ సాయంతో ఉపయోగించే ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలకు ధీటుగా ఇంటర్నెట్ అవసరం లేని షేర్ఇట్ యాప్‌ను కూడా వినియోగిస్తున్నారు. 2014లో భారత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ఏడాది కాలంలోనే 100 మిలియన్ యూజర్ల ఖాతాలో చేరిపోవడం గమనార్హం. ఈ యాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా 400మిలియన్ యూజర్లు ఉండగా.. భారత్‌లోనే 100మిలియన్ యూజర్లు ఉండటం విశేషం. అందుకే యాప్‌స్టోర్ హాట్‌యాప్ లిస్ట్‌లో యూట్యూబ్‌ను సైతం వెనక్కి నెట్టి నాలుగోస్థానంలో నిలిచింది. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని పంపడానికి అవకాశం ఉండటం.. ఇంటర్నెట్ అవసరం లేకపోవడం ఈ యాప్ కు పెద్ద ప్లస్ పాయింట్స్.

English summary

SHAREi IT application sharing app has announced that it has hit 100 million local users in Indian app market