బిగ్‌బాస్‌-9 ప్రమోషన్లో సల్మాన్‌ - షారుక్‌

Sharukh And Salman In Big Boss Add

01:11 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Sharukh And Salman In Big Boss Add

బాలీవుడ్‌ హీరోలు సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ చాలా కాలం తరువాత మళ్ళీ కలసి నటించారు. వీరు ఎప్పుడు కలిసి నటిస్తారో అని అందరూ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరూ బిగ్‌బాస్‌-9 ప్రమోషన్‌లో కలిసారు.

సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యతగా రాబోతున్న బిగ్‌బాస్‌ 9 షోలో షారుక్‌ తన దిల్‌వాలే సినిమా ప్రమోషన్‌ను చెయ్యనున్నాడని భావించారు. అయితే వారిద్దరు బిగ్‌బాస్‌ 9 షో యొక్క ప్రచార కార్యక్రమంలో కలిసి నటించి అందరినీ ఆకట్టుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ షోలో షారుక్‌ఖాన్‌ పాల్గొనడం ఇదే మొదటిసారి వీరిద్దరూ చివరి సారిగా షారుక్‌ఖాన్‌ వ్యాఖ్యానం వహించిన "కౌన్‌ బనేగా క్రోర్‌ప్రతి" షోలో సల్మాన్‌ పాల్గొన్నారు. మళ్ళీ దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత సల్మాన్‌, షారుక్‌ కలిసి ఈ బిగ్‌బాస్‌ 9 ప్రమోషన్‌ యాడ్‌లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌ 9 షో మీద అంచనాలు పెరిగిపోయాయి.

వీరిద్దరు కలసి సందడి చేసిన వీడియోను మీరు చూడండి.

English summary

Bollywood top heros sharukh khan and salman khan together appear in one frame after eight long years. Recently they both acted in big boss 9 show add