చెన్నై బాధితులకు షారూక్‌ భారీ విరాళం!!!

Sharukh Khan donated 1 crore rupees for Chennai Flood victims

01:51 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Sharukh Khan donated 1 crore rupees for Chennai Flood victims

చెన్నైలో సంభవించిన వరదల వల్ల ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులు అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చూసి కోలీవుడ్‌ హీరోలు స్పందించి భారీ విరాళాలు సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు అందించారు. మరో అడుగు ముందుకేసి హీరో విశాల్‌, సిద్ధార్ధ్‌, ఇళయరాజా స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఆహారం మరియు వైద్య సదుపాయాలు అందించారు. ఆ తరువాత టాలీవుడ్‌ హీరోలు కూడా తమ వంతు సాయం చేశారు. మన మద్రాస్‌ కోసం అంటూ కేంపెయిన్‌ నిర్వహించి విరాళాలు కూడా సేకరించారు. ఇప్పుడు తాజాగా చెన్నై బాధితులకు బాలీవుడ్‌ బాద్‌షా షారూక్ ఖాన్ ఎక్కువ మొత్తంలో కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

తన ప్రొడక్షన్‌ సంస్థ అయిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తరపున ఈ విరాళం అందిస్తున్నాడు. ఈ విషయాన్ని ఒక లెటర్‌ ద్వారా వెల్లడించి ఆ లెటర్‌ ని ఆన్‌లైన్‌లో షారూక్‌ పోస్ట్‌ చేశాడు. ఇప్పటికే తమిళనటుడు, దర్శకుడు లారెన్స్‌ కోటి రూపాయలు ఇవ్వగా తాజాగా షారూక్‌ ఇంత భారీ విరాళాన్ని ఇస్తున్నారు.

English summary

Sharukh Khan donated 1 crore rupees for Chennai Flood victims. He is only hero donated huge amount for Chennai flood victims.