అమీర్‌ వ్యాఖ్యాలను వెనకేసుకొచ్చిన షారుఖ్‌

Sharukh Khan Supports Amir Khan

05:45 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Sharukh Khan Supports Amir Khan

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ఖాన్‌ తన సహ నటుడు అమీర్‌ఖాన్‌ను వెనకేసుకొచ్చాడు. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ తన భార్య దేశం వదిలి వెళ్ళిపొదాం అంద్దంటూ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసిన అమీర్‌ఖాన్‌ పై దేశమంతా వ్యతిరేకతా కొనసాగింది. దేశంలో పరిస్థితులు బాగానే ఉన్నాయని పేర్కొంటూ వివిధ రంగాలకు చెందిన రాజకీయ,సినీ ప్రముఖులు అమీర్‌ వ్యాఖ్యాలను ఖండించారు.అమీర్‌ఖాన్‌ దేశం వదిలి పెట్టి వెళ్ళాలనుకుంటే అది అమీర్‌ వ్యక్తిగతమని, దేశాన్ని విడిచి వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా వెళ్ళిపోవచ్చని తీవ్రస్థాయిలో మండి పడ్డారు.

దీనిపై షారుఖ్‌ఖాన్‌ స్పందిస్తూ ఎవరైనా తన దేశభక్తి ని వేరే విధాలలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, మనం మంచి చెయ్యాలని తలిస్తే మంచే జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క దేశప్రయోజనాల కోసం పని చెయ్యాలని హితవు పలికాడు.

English summary

Shah Rukh khan supports amir khan's contrversial words on intolerance in india and Shah Rukh Khan said that one does not need to prove his patriotism.