మహేష్‌, చరణ్‌తో మల్టీస్టారర్‌!

Sharukh Khan told to media that i will do multistarrer with Mahesh and RamaCharan

11:07 AM ON 9th December, 2015 By Mirchi Vilas

Sharukh Khan told to media that i will do multistarrer with Mahesh and RamaCharan

బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ తాజాగా నటించిన చిత్రం 'దిల్‌వాలే.' 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగె' చిత్రం తరువాత షారూక్‌, కాజోల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో షారూక్‌ కాజోల్‌ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ చిత్రం ప్రమోషన్కై హైదరాబాద్‌ వచ్చిన దిల్‌వాలే టీమ్‌ ప్రమోషన్‌ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ ప్రమోషన్‌ కార్యక్రమంలో షారూక్‌- కాజోల్‌ పాల్గొనగా మీడియా షారూక్‌ని ఒక ప్రశ్న అడిగింది. మీరు ఒకవేళ తెలుగులో సినిమా తియ్యాల్సి వస్తే ఎవరితో సినిమా చేస్తారు అని అడుగగా, షారూక్‌ స్పందిస్తూ మహేష్‌-చరణ్‌లతో మల్టీస్టారర్ చేస్తానని చెప్పాడు.

ఆ తరువాత కాజోల్‌ స్పందిస్తూ చరణ్‌ తో సినిమా కచ్చితంగా చేయాల్సిందే అతను మంచి నటుడు అంటూ పొగిడేసింది కాజోల్‌. ముఖ్యంగా ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో చిత్రంతో సల్మాన్‌కి, చరణ్‌కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ చిత్రం తెలుగులో ప్రేమలీలగా విడుదలైంది. ఇందులో సల్మాన్‌కి చరణ్‌ గాత్ర దానం చేశాడంటూ షారూక్‌ -కాజోల్‌ గుర్తు చేశారు. అంతే కాకుండా దిల్వాలే చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జరిగినప్పడు షారూక్‌ చరణ్‌-మహేష్‌తో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. అందుకే ఆ స్నేహాన్ని గుర్తు చేసుకుని వాళ్ళిద్దరి పేర్లు చెప్పాడు షారూక్‌.

English summary

Sharukh Khan told to media that i will do multistarrer with Mahesh and RamaCharan in Dilwale promotion event.