శ్రీమంతుడు షారుక్‌.! 

SharukhKhan Tops In Forbes List

12:23 PM ON 11th December, 2015 By Mirchi Vilas

SharukhKhan Tops In Forbes List

బాలీవుడ్‌ బాద్‌షా కింగ్‌ ఖాన్‌ షారుక్‌ఖాన్‌ ఫోర్బ్స్ లిస్ట్ లో మొదటి స్ధానం దక్కించుకున్నాడు. ఫోర్బ్స్‌ వారు విడుదల చేసిన భారతదేశం టాప్‌ 100 సెలబ్రెటిల లిస్ట్‌ లో షారుక్‌ మొదటి స్ధానాన్ని దక్కించుకున్నాడు. గత సంవత్సరం షారుక్‌ నాలుగో స్ధానంలో ఉండగా ఇప్పడు ఈ ఏడాది టాప్‌ పోజిషన్‌కి చేరుకున్నాడు.

ఈ ఫోర్బ్స్ లిస్ట్‌ ప్రకారం షారుక్‌ 2015లో ఇప్పటి వరకు 257.5 కోట్లును సంపాదించాడు. ఈ సంవత్సరం షారుక్‌ ఖాన్ కు బాగా కలిసి వచ్చిందినే చెప్పాలి. గత నాలుగేళ్ళ లో ఏ సెలబ్రెటి కూడా సంపాదించని డబ్బును షారుక్‌ఖాన్‌ ఈ ఏడాది సంపాదించాడు.

ఇక నెం. 2 విషయానికి వస్తే రోండోవ స్ధానంలో కొన్నసాతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌. ఈ సంవత్సరం లో పాపులారిటి పరంగా, అటు సంపాదన పరంగా సల్మాన్‌ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ సంవత్సరం సల్మాన్‌ 202.75 కోట్లును సంపాదించాడు.

టాప్‌ పది స్ధానాల్లో ఉన్న సెలబ్రెటి వివరాలు ఇలా ఉన్నాయి.

1. షారుక్‌ఖాన్‌ - 257.50 కోట్లు

2. సల్మాన్‌ఖాన్‌ - 207.75 కోట్లు

3. అమితాబచ్చన్‌ - 112.00కోట్లు

4. ఎం.ఎస్‌. ధోని- 199.33 కోట్లు

5.అమీర్‌ఖాన్‌ - 104.25కోట్లు

6. అక్షయ్‌కుమార్‌ - 127.83కోట్లు

7. విరాట్‌కోహ్లి- 104.78కోట్లు

8. సచిన్‌ టెండుల్కర్‌ - 40 కోట్లు

9. దీపికా పడుకునే - 59.00కోట్లు

10. హృతిక్‌రోషన్‌ -74.50 కోట్లు

English summary

Shah Rukh Khan tops 2015 Forbes India Celebrity 100 list . He earbed 257.5 crores of ammount in 2015 year. Salman khan was in second position with 202.75 crores