శశికళ ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం కావచ్చట

Shashekala can become CM when ever she want

10:58 AM ON 10th January, 2017 By Mirchi Vilas

Shashekala can become CM when ever she want

భీష్ముడు అంపశయ్య పడుకుని ఎప్పుడు కావలిస్తే అప్పుడు ప్రాణాలు విడిచే వరం పొందాడు. మరి దీనికి భిన్నంగా ఎప్పుడు కావలిస్తే అప్పుడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ సీఎం అయ్యే ఛాన్స్ ఉందట. ఈ విషయం వినడానికి ఎబ్బెట్టుగానే వున్నా, అన్నా డీఎంకే నేత చెప్పిన తీరు చూస్తుంటే, మాత్రం అలానే వుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు శశికళ సీఎం పదవి చేపట్టవచ్చని పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ మైత్రేయన్ అన్నారు. ఇండియాటుడే దక్షిణ కాన్ క్లేవ్ లో అయన ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్నమ్మ ఎప్పుడు సీఎం పదవి చేపట్టాలనేది ఆమె ఇష్టం. దానికి మేము ఎప్పుడూ అడ్డు చెప్పం అని ఆయన అన్నారు. తమిళనాడు అధికార యంత్రాంగం సీఎం మార్పు కోసం ఏర్పాట్లు చేస్తున్నారని ఒక అధికారి వెల్లడించారని విలేకర్లు అడిగిన ప్రశ్నతో మైత్రేయన్ ఏకీభవించారు. కాగా జనవరి 12 /18 తేదీల్లో శశికళ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్నాడీఎంకేలో ఉన్న సంప్రదాయం ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తే సీఎం బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఏది ఏమైనా శశికళ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. మరి అది వికటిస్తుందో , ఫలిస్తుందో వేచిచూడాలి.

ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

ఇది కూడా చూడండి: మెగా బ్రదర్ పై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు

English summary

Tamilnadu party Anadmk wants to make shashekala as CM when ever want. Every wants to follow her opinion.