శశిధరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు - బిజెపి మండిపాటు

Shashi Tharoor Compares Kanhaiya With Bhagat Singh

11:12 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Shashi Tharoor Compares Kanhaiya With Bhagat Singh

దేశంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తోందో , ఆ పార్టీ నేతలు ఏమి మాటాడుతున్నారో అర్ధం కావడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ కొందరు కాంగ్రెస్ నేతలు వార్తల కెక్కుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ దేశద్రోహం కోసులో నిందితుడిగా ఉన్న కన్నయ్య కుమార్‌ని భగత్‌ సింగ్‌తో పోల్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం జేఎన్‌యూలో ఓ విద్యార్థి బృందాన్ని ఉద్దేశించి థరూర్‌ ప్రసంగించారు.

‘కన్నయ్య కుమార్‌ లాంటి వారు దేశ ద్రోహం చట్టం కింద బాధితులుగా ఉన్నారు. నిజం చెప్పాలంటే కన్నయ్య ఈ కాలపు భగత్‌సింగ్‌. బ్రిటీష్‌ పాలనలో జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మా గాంధీ, బాల గంగాధర తిలక్‌, భగత్‌సింగ్‌ లాంటివారందరూ ఈ చట్టం కింద బాధితులుగా ఉన్నవారే’ అంటూ థరూర్‌ అక్కడ ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తిని దేశ ద్రోహం కేసులో నిందితుడితో పోలుస్తారా..? అంటూ మండి పడ్డారు. అఫ్జల్ గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించి జాతివ్యతిరేక నినాదాలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న కన్నయ్యను షహీద్ భగత్‌సింగ్‌తో పోల్చడం దారుణమని బిజెపి నేత షాన్‌వాజ్ హుస్సేన్ మండిపడ్డారు. అటు కాంగ్రెస్ కూడా శశిథరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ప్రకటించడం విశేషం.

దయనీయ స్థితిలో విజయకాంత్

విమానంలో పేలిన ఐఫోన్

కావాలనే రోజాను జగన్ ఇరికించాడా...

సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

English summary

Congress party leader and Ex Minister of India Shashi Tharoor compared Kanhaiya who was arrested in JNU incident with the Freedom Fighter Bhagat Singh.BJP party opposed his words and Congress party said that was his Personal matter.