పికె ఇండియాలో హిట్‌ అయ్యేదా

Shatrughan Sinha Comments On Amirkhan

11:24 AM ON 27th November, 2015 By Mirchi Vilas

Shatrughan Sinha Comments On Amirkhan

దేశంలో మత అసహనం కనుక పెరిగిపోయి ఉంటే అమీర్‌ఖాన్‌ నటించిన పికె సినిమా హిట్‌ అయ్యి కోట్లు కొల్లగొట్టేది కాదని బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అమీర్‌ఖాన్‌ మత సహనం వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ వెటరన్‌ స్టార్‌ శత్రుఘ్న సిన్మా తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించారు. అమీర్‌ఖాన్‌ కుటుంబం దేశాన్ని వీడిపోవాలనుకున్న నిర్ణయం తనను బాధించిందని, అమీర్‌ఖాన్‌ కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానం ఉన్నప్పటికీ, దేశంలో మత అసహనం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్ధించదలచుకోలేదన్నారు. ఒక వేళ దేశంలో మత అసహనం అనేది ఉంటే హిందుత్వంపై, హిందూ దేవుళ్ళపై సెటైర్లు వేస్తూ తీసిన అమీర్‌ఖాన్‌ పికె సినిమా అంత విజయాన్ని ఎలా సాధించిందని శత్రుఘ్న సిన్హా ఎదురు ప్రశ్నించారు.

English summary

Veteran Bollywood Actor Shatrughan Sinha responds in his way on amir khan's contreversial words. He asks amir khan if that pk , whEre hindu gods and goddesses were made fun of if no uncertain terms would not have seen such sucess if india was intolerant country