మోడీకి సినిమా  చూపిస్తున్నబిహారీబాబు 

Shatrughan Sinha Contreversial Comments

01:14 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Shatrughan Sinha Contreversial Comments

మొత్తానికి బిజెపిని కూడా వర్గ పోరు కాంగ్రెస్ మాదిరిగానే బలంగానే వెంటాడుతూనే ఉంది. తాము తలచుకుంటే ఎవరూ మినహాయింపు కాదని కొందరు నిరూపిస్తుంటారు. ఇప్పుడు బిజెపిలో అదే జరుగుతోంది. సొంత పార్టీలోనే లుకలుకలు ఒక్కోరకంగా వెంటాడుతున్నాయి. తాజాగా ఆపార్టీ లో సత్రుగ్న సిన్హా వ్యవహరిస్తున్న తీరు ఆపార్టీ నేతలనే కాదు , ప్రధాని మోడీని ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి.

దేశంలో ఎన్నడూ లేనంతగా బిజెపికి బంపర్ మెజార్టీ రావడం , మిత్రులతో కూడా పని లేకుండా సొంతంగా వచ్చిన మెజార్టీ తో ఇక తనకు తిరుగేలేదన్నట్లుగా సాగుతున్న మోడీ టీం కి స్వపక్షంలోనే తలనొప్పులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఓపక్క పార్టీ సీనియర్ నేతల అసంతృప్తి ఏదో రూపంలో బయట పడుతూ వుంటే, మరోవైపు అరుణ్ జైట్లీ- కీర్తి అజాద్ ల వ్యవహారం ఇరుకున పెడుతుంటే , ఇది చాలదన్నట్లు ఆ పార్టీకి షాట్ గన్ శత్రుఘ్న సిన్హా వ్యవహారం కొరుకుడు పడడంలేదు. బీహార్ ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత వరుస విమర్శలు చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్న ఈ బిహారీబాబు పై కూడా వేటు వేయనున్నట్లు వార్తలు రావడంతో, ఇప్పుడు మరోసారి తన మాటలతో మోడీ అండ్ కోకి ‘సినిమా’ చూపిస్తున్నారు.

దమ్ముంటే తన మీద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ అధినాయకత్వానికి సవాలు విసిరారు. ఈ సవాలు బీజేపీకి అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోడీకే నన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదని, అయినప్పటికీ తనను పార్టీ నుంచి గెంటేయాలని అనుకుంటే, నిరభ్యంతరంగా గెంటేయొచ్చ ని అంటున్న శత్రుఘ్న సిన్హా, చర్యకు ప్రతిచర్య కూడా ఉంటుందన్న న్యూటన్ థర్డ్ థియరీని గుర్తు పెట్టుకోవాలంటూ చురకలంటించారు. ఈ మధ్యనే పార్టీ చర్యలు తీసుకున్న కీర్తి అజాద్ ను తెగ పొగిడేస్తూ, ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో షాట్ గన్ వ్యవహారశైలి ఇప్పుడు బీజేపీ ని ఇబ్బందుల్లో నెడుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. అధికారం వస్తే , అన్ని అవలక్షణాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయనే నానుడుని నిజం చేస్తున్నాయి కమలదళంలో రెబల్ స్టార్ ల సవాళ్లు ....

English summary

Bihar BJP leader Shatrughan Sinha made some contreversial on BJP party.He said that nobody can suspend him from BJP party without his fault