ప్రియుడి కోసం ఆమె ఓ సాహసం చేసింది .. తీరా ఏమైందంటే

She did an adventure for her lover

11:16 AM ON 17th January, 2017 By Mirchi Vilas

She did an adventure for her lover

ప్రేమ గుడ్డిది అంటారు కొందరు ప్రేమవలలో పడితే ఇంకేమీ తెలీదంటారు మరికొందరు. ఇక ప్రేమకోసం.. ప్రియురాలి కోసం ప్రియుడు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఎన్ని యుద్ధాలైనా చేస్తాడు. విలన్లతో పోరాడుతాడు. దెబ్బలు తింటాడు. జైలుకెళ్తాడు. ప్రేమను గెలుపించుకోవడం కోసం ఏదైనా చేస్తాడు. కాదంటే ప్రాణాలు తీసుకునే వాళ్ళున్నారు. ఇవన్నీ సహజం. అయితే ఓ ప్రియుడు కోసం ఓ ప్రియురాలి చేసిన సాహసం తెలిస్తే,. ఔరా! అంటూ ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళ్తే,

వెనుజులాకి చెందిన 25ఏళ్ల ఆంటోనిటా రొబుల్స్ సౌడా బార్సిలోనాలోని ప్యుంటె అయేలా జైలులో శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు జోస్ ఆంటోనియోను చూసేందుకు వచ్చింది. ఆమెతో పాటు తన పాపను.. గులాబి రంగు సూట్ కేస్ ను వెంట తెచ్చుకుంది. ఈ జైల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన వారు రాత్రంతా అక్కడే గడిపే వెసులుబాటు ఉంది. దీంతో సౌడా తన ప్రియుడితో రాత్రంతా గడిపింది. మరుసటి రోజు సౌడా తాను తెచ్చుకున్న గులాబి రంగు సూట్ కేసులో ప్రియుడిని కుక్కి పడుకోబెట్టి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.

దాదాపు తప్పించుకున్నారన్న సమయంలో జైలు ద్వారం వరకు సూట్ కేసును మోసుకెళ్లిన సౌడా ద్వారం గడపను దాటించేందుకు చాలా అవస్థలు పడింది. సూట్ కేసులో ప్రియుడు ఉండటంతో అది బరువైక్కింది. దాన్ని సౌడా ఒక్కతే మోయలేకపోయింది. వచ్చేటప్పుడు సౌడా సూట్ కేసును అవలీలగా మోసుకెళ్లింది. ఇప్పుడు మోసేందుకు శ్రమిస్తుడంటం చూసిన పోలీసుకులకు అనుమానం వచ్చింది. వెంటనే సూట్ కేసును తెరిచారు. అందులో ఆమె ప్రియుడు జోస్ ఆంటానియో ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. వెంటనే అతన్ని మళ్లీ జైలు గదికి పంపి.. సౌడాను కోర్టులో హాజరుపర్చారు. తొందరల్లో ఆమెకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. వారి పాపను సోషల్ సర్వీస్ శాఖకు అప్పగించనున్నారు.

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చూడండి: మీ మొబైల్ నుండి వేరే నంబర్ కి బ్యాలన్స్ ట్రాన్సఫర్ చేయండిలా..

ఇది కూడా చూడండి: ఛ ఛ... హాల్ టికెట్ మీద ఆమ్మాయి ఫోటో బదులు, ఎవరి ఫోటో ఉందొ తెలుసా?

English summary

Generally we say love is blind and movies we watch here doing adventures for his girl friend but in real life we also see few people.Here a lady did an adventure for her husband.