ఈమె వయస్సు 36.. కానీ ఈమె బరువెంతో తెలిస్తే షాకౌతారు!

She is 36 her but her weight is 500 kilos

04:17 PM ON 25th October, 2016 By Mirchi Vilas

She is 36 her but her weight is 500 kilos

బరువు పెరగకుండా చాలామంది వ్యాయామం, ఆరోగ్య నియమాలు పాటిస్తుంటే, ఈజిప్టుకు చెందిన ఇమాన్ అహ్మద్ అబ్దుల్లాటీ ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయురాలైన మహిళగా గుర్తింపు పొందింది. ఈమె వయస్సు 36 సంవత్సరాలు. బరువు చూస్తే, 500 కిలోలు. అధిక బరువు కారణంగా 25 ఏళ్లుగా అలెగ్జాండ్రియాలోని తన ఇంటి నుంచి ఆమె ఒక్కసారి కూడా బయటకు అడుగు పెట్టలేదట. కనీసం మంచం మీద నుంచి అటూ ఇటూ కదలడానికి కూడా ఆమె శరీరం సహకరించడంలేదని, రోజువారి కార్యక్రమాల కోసం తల్లి, చెల్లెలిపై ఆధారపడాల్సి వస్తోందని డెయిలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. ఇమాన్ పుట్టినప్పుడు 5 కిలోల బరువు మాత్రమే ఉందట. ఎలిఫెంటాసిస్ వ్యాధి రావడంతో ఆమె లావు పెరుగుతూ వచ్చింది.

మెదడుకు స్ట్రోక్ రావడంతో పాఠశాల చదువు కూడా ఆగిపోయింది. స్ట్రోక్ కారణంగా ఇమాన్ శరీరంలోని ఓవైపు చచ్చుపడిపోయి చివరికి మంచానికి పరిమితమైంది. పదకొండేళ్ల ప్రాయంలో భారీకాయం కారణంగా లేచి నిలబడలేకపోయేదని, ఇంట్లోనో పాకుతూ ఉండేదని ఇమాన్ సోదరి చైమా అహ్మద్ అబ్దుల్లాటీ తెలిపింది. ఆ తర్వాత ఇమాన్ మంచానికే పరిమితమైన ఇప్పటి వరకూ ఎలాగో నెట్టుకు వచ్చామని, ఆమెకు అత్సవసర చికిత్స చేయకుంటే ఏమవుతుందోనన్న భయం కలుగుతోందని చైమా ఆవేదన వ్యక్తం చేసింది. తన సోదరికి వైద్యసహాయం అందించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహెల్ సిసిని ఆన్ లైన్ లో ఆమె కోరింది.

English summary

She is 36 her but her weight is 500 kilos