ఆసుపత్రిలో 'అమ్మ'.. ఇక తమిళనాడులో ఈ అధికారి చెప్పిందే వేదం

Sheela Balakrishnan is doing Jayalalitha job

01:03 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Sheela Balakrishnan is doing Jayalalitha job

సమర్థులైన అధికారులుంటే, ఎలాంటి పనులైనా ఈజీగా అయిపోతాయి. పాలన భేషుగ్గా సాగిపోతుంది. సరిగ్గా తమిళనాడుకి ఇప్పుడు అదే ఓ వరంగా మారింది. లేకపోతే, ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా 15 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పాలన సజావుగా ఎలా సాగుతోంది. ఒకే ఒక అధికారి కనుసన్నల్లో ఆరవ దేశం నడిచిపోతోందంటే, దానికి వేసిన పునాది అలాంటిది మరి. వివరాల్లోకి వెళ్తే.. తన ఆరోగ్యం పరంగా రాష్ట్ర పాలనకు ఇబ్బంది రాకూడదని భావించిన ముఖ్యమంత్రి జయలలిత ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సలహాదారుగా నియమించుకున్నారు.

ఆ అధికారి ఇచ్చే ఆదేశాలను కూడా ముఖ్యమంత్రి జయలలిత తూచా తప్పకుండా పాటించడం ద్వారా అందరూ ఆవిధంగా నడుచుకునేలా చేస్తూ వచ్చారు. ఆ అధికారి పేరు షీలా బాలకృష్ణన్. అనారోగ్య కారణంగా సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత తన భుజస్కంధాలపై షీలా బాలకృష్టన్ వేసుకున్నారు. పాలనాపరంగా ప్రస్తుతం తమిళనాడులో ఉన్నతాధికారులతో పాటు జయలలిత క్యాబినేట్ లో ఉండే మంత్రులు కూడా ఆమె సూచనల మేరకు నడుచుకుంటున్నారంటే, ఈమె దక్షత ఏపాటిదో చెప్పక్కర్లేదు. ఇంతకీ 62 సంవత్సరాల షీలా బాలాకృష్ణన్ 2014లో తన సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు.

ఆమె నిజాయితీ, పని పట్ల దీక్షతను గుర్తించిన జయలలిత ఆమెను సలహాదారుగా నియమించుకున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలా 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జయలలితకు అత్యంత విశ్వసనీయురాలైన సలహాదారుగా షీలా బాలాకృష్ణన్ పేరుగాంచారు. ఆమె సలహాల మేరకే తమిళనాడు సీఎస్పీ రామమోహన్ రావు, డీజీపీ టీకే రాజేంద్రన్ నడుచుకుంటున్నారు. అన్నాడీఎంకేలో అమ్మకు నమ్మిన బంటుగా ఉన్న పన్నీర్ సెల్వం లాంటి వారు కూడా పాలనలో షీలా సూచన ప్రకారమే నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. అమ్మ ఆసుపత్రిలో ఉన్నా, తమిళనాడులో పరిపాలనలో ఎలాంటి చిక్కులు రాకుండా ఆమె సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

జ్వరం, డీహైడ్రేషన్ తో సెప్టెంబర్ 22వ తేదీన జయ ఆసుపత్రిలో చేరడంతో ఆమె స్థానంలో పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్ నే నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఆమె రాష్ట్రంలో అత్యంత కీలక వ్యక్తిగా మారారని, ఆమె సమ్మతి లేకుండా ఏమీ జరగడం లేదని ఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారట.. ఆమె అనుమతి లేకుండా పాలనపై పెదవి విప్పడానికి అధికార వర్గాలకు గానీ, సీనియర్ మంత్రులకు కానీ లేదని వారు తెలిపారు. అపోలో ఆసుపత్రిలో అమ్మ ఉన్న గదికి పక్కనే మరో గదిలో షీలా బాలాకృష్ణన్ కూడా ఉంటున్నారు. అదే అంతస్తులో ఆమె పక్క గదిలో జయలలిత స్నేహితురాలైన శశికళ కూడా బస చేశారు. జయలలిత ఆరోగ్యంపై వాకబు చేసేందుకు ఆసుపత్రికి వస్తున్న ఉన్నతాధికారులు పాలన విషయంలో షీలా బాలాకృష్ణన్ సూచనలు తీసుకుంటున్నారు. అదీ సంగతి.

English summary

Sheela Balakrishnan is doing Jayalalitha job