షెల్‌లో 10 వేల ఉద్యోగులకు ఉద్వాసన

Shell announces ten thousand job cuts

09:39 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Shell announces ten thousand job cuts

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థ షెల్ పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసివేయనుంది. సుమారు పది వేల మంది ఉద్యోగులను తొలిగించనున్నట్లు యూరోప్ కు చెందిన ఆ సంస్థ ధ్రువీకరించింది. 13 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వార్షిక ఆదాయం పడిపోవడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నాలుగో క్వార్టర్‌లో ఆ కంపెనీ రెండు బిలియన్ల డాలర్లను మాత్రమే ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఆ కంపెనీ ఫోర్త్ క్వార్టర్‌లో అయిదు మిలియన్ల డాలర్లను ఆర్జించింది. యూరోప్‌కు చెందిన బీజీ ఇంధన సంస్థతో షెల్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆదాయం పడిపోవడంతో షెల్ సంస్థ అన్ని రకాల ఖర్చులను తగ్గిస్తోంది. అయితే ఇంధన ధర బ్యారల్‌కు 60 డాలర్లు ఉంటేనే బీజీ-షెల్ సంస్థల విలీనం జరుగుతుందని స్టాండర్డ్ లైఫ్ సంస్థ పేర్కొంది. ఇప్పటికే షెల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆరు బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను వేలం వేసింది. రానున్న ఏడాదిలో మరో 30 బిలియన్ డాలర్ల ఆస్తులను అమ్మనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

English summary

The biggest oil company shell confirms ten thousand job cuts and falling profit. Oil companies and their suppliers have been cutting back hard on investment and jobs as the low price eats into profits and makes investment less worthwhile.