ఈ వయసులో ఆ పాత్ర చేస్తుందట!

Shilpa Shetty ready to act in mother roles

05:47 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Shilpa Shetty ready to act in mother roles

బాలీవుడ్ హాట్ హీరోయిన్ శిల్పా శెట్టి మళ్ళీ సినిమాల్లో నటిస్తుందట. అంతే కాదు ఆ పాత్రలో కూడా నటించడానికి కూడా సిద్ధమట! ఇంతకీ ఏంటా పాత్ర? అనే దానిపై విషయంలోకి వెళితే.. మామూలుగా హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవుతుంటారు. కొన్నాళ్లకు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలకునుకున్నా.. ఇంతకుముందులా అవకాశాలు రావడం కష్టమే. వచ్చినా సహాయక పాత్రలు.. తల్లి పాత్రలు, అత్త పాత్రలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీదేవి, టబు కూడా తల్లి పాత్రలోనే నటించారు. ఇదే బాటలో ఇప్పుడు యోగ భామ శిల్పాశెట్టి కూడా నడవడానికి సిద్ధమైంది. వెండితెరపై కనిపించేందుకు సిద్ధమని చెబుతోంది. 2009లో రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది శిల్పాశెట్టి.

ఆ తర్వాత కొన్నాళ్లకి బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అంతేగానీ.. వెండితెరపై కనిపించలేదు. అయితే ఇప్పుడు తనకు సినిమాల్లో నటించాలని ఉందని.. తల్లి పాత్ర ఇచ్చినా చేస్తానని అంటోంది. తల్లి పాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నిజ జీవితంలోనూ నేను తల్లినే. కాబట్టి నాకు ఆ పాత్రలో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అది నా సమయాన్ని వృథా చేయకుండా ఉండాలి. ఎందుకంటే నేను సినిమాలు చేసినా.. చేయకపోయినా బిజీగానే ఉంటాను. తల్లిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు టీవీషో న్యాయనిర్ణేతగా ఉన్నాను. అలాగే మరికొద్ది రోజుల్లో ఓ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నా. కాబట్టి ఆ సమయానికి తగ్గట్లు నటించాల్సి ఉంటుంది. అని చెప్పుకొచ్చింది ఈ యోగ బ్యూటీ.

ఇది కూడా చదవండి: ఆ లేడీస్ హాస్టల్ లో నిజంగా దెయ్యం ఉందా?(వీడియో)

ఇది కూడా చదవండి: ఎంత మందితో సెక్స్ చేశానో లెక్కేలేదు: అంబర్ రోజ్

ఇది కూడా చదవండి: మీరు బంగారు ఉంగరాలు పెట్టుకుంటున్నారా? అయితే ఇది చదివాక వెంటనే తీసేస్తారు!

English summary

Shilpa Shetty ready to act in mother roles. Yoga beauty Shilpa Shetty ready act in mother roles.