అబ్బో, ఆ రియాల్టీ షోకి రూ.14 కోట్లా?

Shilpa Shetty will be charging 10 to 14 crore

03:26 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Shilpa Shetty will be charging 10 to 14 crore

అది కాకుంటే ఇది, ఇది కాకపొతే అది అన్నట్టు కొంతమంది సినీ తారలు ఎక్కడైనా సంపాదనకు లోటు వుండదు. సరిగ్గా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి విషయంలో ఇదే జరిగింది. ఈమెకి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో రియాల్టీ షోలకే పరిమితమైపోయింది. తాజాగా 'ఇండియాస్ సూపర్ డ్యాన్సర్' అనే రియాల్టీడ్యాన్స్ షోకి శిల్ప న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది. ఈ రియాల్టీషోకి శిల్ప ఏకంగా రూ.10 నుంచి 14 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల కధనం.

ఈ డ్యాన్స్ షో కోసం నిర్మాణ బృందం ప్రముఖులను న్యాయనిర్ణేతలుగా ఎంచుకోవాలనుకున్నారు. ఇందుకోసం పలువురితో చర్చలు కూడా జరిపారు. ఆఖరికి శిల్పను సంప్రదించి ఆమెను ఎంపికచేసుకున్నారు. 'డ్యాన్స్ అన్నా, పిల్లలన్నా నాకు చాలా ఇష్టం. సో ఈ రియాల్టీ డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా నేను సరిగ్గా సరిపోతా. ఈకాలం పిల్లల్లోఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. వారి నుంచే మనం చాలా నేర్చుకోవాలి. అదీ కాకుండా వారి అమాయకత్వం మనల్ని ఇంకా కవ్విస్తుంటుంది. ఈ రియాల్టీ షో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని శిల్ప ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. శిల్పా శెట్టి ఈ షోతో పాటు ఝలక్ దిఖ్లాజా, నచ్ బలియే, జరా నచ్కే దిఖా రియాల్టీ షోలకు కూడాన్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. 'ఇండియాస్ సూపర్ డ్యాన్సర్' సోనీ ఛానెల్లో ప్రసారం అవుతుంది. అదండీ సంగతి.

ఇది కూడా చూడండి :ఫేస్ బుక్ లో అత్యధిక 'లైక్ ల' వీరుడు మోడీ

ఇది కూడా చూడండి :భూగర్భంలో అంతుచిక్కని మిస్టరీలు

ఇది కూడా చూడండి :జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసా?

English summary

Shilpa Shetty will be charging 10 to 14 crore.