వావ్! సెకనుకు రెండు ఫోన్లు అమ్మేసిన షియోమీ

Shiomi mobiles sold 2 phones for second

03:28 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Shiomi mobiles sold 2 phones for second

ఇబ్బడి ముబ్బడిగా చైనా సెల్ ఫోన్లు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేవలం మూడు రోజుల్లో ఐదు లక్షల స్మార్ట్ ఫోన్లను విక్రయించినట్టు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ ప్రకటించింది. అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్టుల్లోని సీజన్ సేల్స్ ద్వారా ఈ విక్రయాలు జరిగినట్టు తెలిపింది. కాగా గతేడాది ఇంతే సంఖ్యలో ఫోన్లను 30 రోజుల్లో విక్రయించినట్టు పేర్కొంది. వెల్లువెత్తిన అమ్మకాలతో రెడ్ మీ 3ఎస్ ప్రైమ్, రెడ్ మీ నోట్ 3 ఫోన్లు ఫ్లిప్ కార్టు ద్వారా ఒక్కరోజే అమ్ముడు పోయినట్టు తెలిపింది. దీపావళికి కూడా ఇంతకుమించిన డిమాండ్ ఉండే అవకాశం ఉందని సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు.

స్టాక్ మొత్తం నిండుకోవడంతో ఫాక్స్ కాన్ తో కలిసి స్థానికంగా ఉత్పత్తిని పెంచుకునే పనిలో పడింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అమ్మకాల కోసం తగినంత స్టాక్ ను సిద్ధం చేస్తామని షియోమీ పేర్కొంది. 72 గంటల్లోపే 5 లక్షల ఫోన్లు విక్రయించాం. మూడు రోజుల్లోనే అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్టు ద్వారా ఈ అమ్మకాలు సాగాయి. అంటే ప్రతీ సెకనకు రెండు ఫోన్లు అమ్ముడయ్యాయి అని షియోమీ ఇండియా ఆపరేషన్స్ హెడ్ మను జైన్ తెలిపారు.

English summary

Shiomi mobiles sold 2 phones for second