అమీర్ ఖాన్‌ని కొట్టే ప్రతి చెంప దెబ్బకి రూ.లక్ష: శివసేన

Shiv Sena offers Rs 1 lakh reward to anyone who slaps Aamir

01:18 AM ON 27th November, 2015 By Mirchi Vilas

Shiv Sena offers Rs 1 lakh reward to anyone who slaps Aamir

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. శివసేన అమీర్ ఖాన్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

భారత్‌లో ఏ ఉపద్రవం వచ్చిందో అమీర్ ఖాన్ చెప్పాలని డిమాండ్ చేసింది. అమీర్ ఖాన్‌ నమ్మకద్రోహుల భాషలో మాట్లాడుతున్నారని శివసేన విరుచుకుపడింది. ఈ మేరకు తమ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. అందులో అమీర్ ఖాన్ పైన మండిపడింది.

భారత్‌ తమ దేశం కాదనుకున్నవారు దేశభక్తి గురించి, సత్యమేవ జయతే గురించి మాట్లాడకూడదని ఆక్షేపించింది. దేశంలో అసహనం ఉందని అమీర్ ఖాన్ భావిస్తే తన చిత్రాలను దేశం వెలుపల విడుదల చేసుకోవాలని సూచించింది.

శివసేన పంజాబ్ చైర్మన్ రాజీవ్ టాండాన్ మాట్లాడుతూ... అమీర్ ఖాన్‌ను ఎవరైనా చెంపదెబ్బ కొడితే వారికి రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించారు. ఆయనను కొట్టే ప్రతి చెంప దెబ్బకు రూ.లక్ష ఇస్తామని ఆయన ప్రకటించారు.

English summary

The Punjab unit of the Shiv Sena on Wednesday announced a reward of Rs 1 lakh per slap for anyone slapping actor Aamir Khan over his recent remarks on “intolerance” in India.