ఎందుకు నవ్వుతున్నావ్... టీవీ యాంకర్ ఫై షోయబ్ ఆగ్రహం

Shoaib Akthar Fires On Indian Anchor

01:39 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Shoaib Akthar Fires On Indian Anchor

భారత్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దాయాదీలు ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే మ్యాచ్ అనంతరం ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం జరిగిన టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక యాంకర్ పై మాజీ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయాబ్ అక్తర్ ఫైర్ అయ్యాడు. ఆ యాంకర్ షోయాబ్ అక్తర్ ను చూసి నవ్వాడు , అలా యాంకర్ నవ్వడాన్ని సహించలేకపోయిన అక్తర్ ఒక్కసారిగా కోపంతో ఊగిపొయాడు , వెంటనే ఆ యాంకర్ ను నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటూ ప్రశ్నించాడు .

దీంతో అక్తర్ కోపాన్ని గమనించిన ఆ యాంకర్ టీవీలో ప్రసారం అవుతున్న మౌకా మౌకా యాడ్ లో ఒక పాకిస్తాన్ అభిమాని పాకిస్తాన్ జట్టు టీ20 టీం కెప్టెన్ అఫ్రిదినీ ఈసారైనా భారత పై మ్యాచ్ గెలవాలని వేడుకుంటాడు. ఇండియా ప్లేయర్స్ కు సిక్సులు ఎలా కొట్టాలో చెప్పాలని అడుగుతాడు . ఈ సారైనా తమ పటాకులు పెలుతయా ..? అంటూ పటాకులను దగ్గరకు తీసుకున్నట్లు గా ఉండే ఆ యాడ్ గురించి ప్రస్తావించి అక్తర్ ను కూల్ చేసే ప్రయత్నం చేసాడు. కోపంతో ఉగిపోతున్న అక్తర్ "నేను ఇక్కడకు వచ్చింది మ్యాచ్ గురించి విశ్లేషణ చెయ్యడానికి , దయ చేసి దానికే పరిమితమవ్వండి , ఇలాంటి జోకులు వద్దు " అంటూ టీవీ యాంకర్ పై అక్తర్ అసహనాన్ని వ్యక్తం చేసాడు. అక్కడే ఉన్న మరో విశ్లేషకుడు కపిల్ దేవ్ వెంటనే కలుగజేసుకుని అక్తర్ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసాడు.

ఆమె నాతో ఒక రాత్రి గడిపితే 6 కోట్లు ఇస్తా

అందరినీ ఏడిపించా : పవన్‌ కళ్యాణ్‌

అన్నయ్య మీద రివేంజ్ తీర్చుకోడానికే పిలిచాడా

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

English summary

Pakistan Fast Bowler Shoaib Akthar fires on Indian Tv Anchor for laughing at him after India defeated Pakistan in Kolkatta.