టిఆర్ఎస్ కీ షాక్ తగిలిందా !?

Shock To TRS In GHMC Results

01:26 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Shock To TRS In GHMC Results

వరస విజయాలతో , పైగా ఆకర్ష్ తో ఫుల్ జోష్ మీదున్న తెలంగాణా రాష్ట్ర సమితికి షాక్ తగిలిందా? అయితే తెలుసుకోవాల్సిందే. ఈనెల 5వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో అసలు ఆ పార్టీయే ఊహించని విధంగా, టిఆర్ఎస్ అనూహ్య విజయం అందుకున్నా, కొన్ని చోట్ల ఓటర్లు షాక్ ఇచ్చారట. దీంతో లెక్కలు వేసుకుంటూ ఎందుకిలా జరిగిందబ్బా అంటూ ఆ పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నారట. మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ పరిధిలో 99 డివిజన్లను సొంతం చేసుకొని రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి కొన్ని డివిజన్లలో ఆ పార్టీ కి డిపాజిట్లు దక్కలేదంటే నమ్ముతారా? నమ్మాలి మరి. ఆవేళ సందడిలో తెలీలేదు గానీ ఆ తర్వాత నింపాదిగా చూసుకుంటే, తేడాలు తెల్సాయట. కౌకు దెబ్బలు ఎలా ఉంటాయో తెల్సిందట.

వివరాలు పరిశీలిస్తే, మొత్తం మీద గ్రేటర్ పరిధిలో 1333 మంది పోటీ చేస్తే, అందులో 1009 మంది కి డిపాజిట్లు గల్లం త్తయ్యాయట . పోలైన ఓట్లలో అత్యధికం ఒకే పార్టీకి పడటం.. పోటీ చాలాచోట్ల త్రిముఖంగా జరగటంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని సరి పెట్టుకున్తున్నారట. . ఇక.. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ చెందిన 126 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతే, కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న టీడీపీ కి 36 డివిజన్లలో డిపాజిట్లు పోయాయి. బీజేపీ 20 చోట్ల, లోక్ సత్తా 25 డివిజన్లలో , బీఎస్పీ 55 డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయాయి.

ఇక టిఆర్ఎస్ 99స్థానాల్ని గెలుచుకుని సొంతంగా మేయర్ సీటుని దక్కించుకునే మెజార్టీ పొందినా, 15 డివిజన్లలో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఊహించనంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పార్టీకి చెందిన అభ్యర్థులు 15 చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారట. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన మజ్లిస్ కు ఇలాంటి చేదు అనుభవమే మిగిలిందట. ఆ పార్టీ గత గ్రేటర్ ఎన్నికలతో పోలిస్తే ఒక స్థానం అధికంగా గెలిచినా.. ఆ పార్టీ పోటీ చేసిన పరిమిత స్థానాల్లో 10 డివిజన్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి.

English summary

Recently Telangana Rashtra Samiti (TRS) had won 99 seats of 150 seats in Greater Hyderabad Municipal Corporation Elections.In 15 divisions TRS has not get deposit and the party candidates were defeated very badly