'అ ఆ' గురించి అలా ఎందుకు అంటున్నారు?

Shocking comments about A Aa movie

12:12 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Shocking comments about  A Aa movie

త్రివిక్రమ్ సినిమా అంటే ఓ అంచనా ఉంటుంది. మాటల మాత్రికుడు గా ఎన్నో సినిమాలకు పదునైన , పంచ్ డైలాగులు రాసిన త్రివిక్రమ్ దర్సకుడుగా మారి, హిట్ సినిమాలు అందిస్తూ వస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన 'అ...ఆ' సినిమా కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ చిత్రం గురువారం గ్రాండ్ గా విడుదలయింది. త్రివిక్రమ్ మార్క్తో తెరకెక్కిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్కు భారీ ధర పలికినట్లు వినిపిస్తోంది. ఓ ప్రముఖ ఛానల్ దాదాపు 6.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ సినిమా ప్రసార హక్కుల్ని సొంతం చేసుకుందట. నితిన్ నటించిన సినిమాలకు ఇంత మొత్తంలో శాటిలైట్ ధర పలకడం ఇదే తొలిసారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే 'అ ఆ' సినిమా ఇప్పుడు రకరకాల చర్చకు దారితీస్తోంది. ఓ పాత సినిమాకు కాపీ కొడుతూ తీసిన ఈ సినిమా కు అంత సీన్ లేదని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు పడిపోతున్నాయి. "నిజం ఏమిటీ అంటే... మీనా సినిమా రైట్స్ తీసుకునే 'అ...ఆ' తీసారు".... "విజయ నిర్మల కృష్ణ నటించిన పాత చిత్రం " మీనా " ఆధునిక రీతిలో మరోసారి ఆ అ తో తెరకెక్కించిన త్రివిక్రమ్ - ఇది నా అభిప్రాయం" ఇలా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. అలాంటప్పుడు రీమేక్ అని చెప్పెస్తే సరిపోయేదిగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:మధురలో చెలరేగిన హింస - ఎస్పీ సహా 21 మంది మృతి

ఇది కూడా చూడండి:ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

ఇది కూడా చూడండి:విలన్ పాత్రలో బన్నీ

English summary

Here Shocking comments on A Aa movie.