ట్రంప్ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

Shocking facts about Donald Trump

11:38 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Shocking facts about Donald Trump

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అగ్ర రాజ్యానికి అధిపతిగా అవతరించిన డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కుడని చెప్పాలి. ఈయన మామూలు వ్యక్తి కూడా కానే కాదు. ప్రపంచ కుబేరుల జాబితాలో 324వ స్థానం పొందిన ఈయన అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడనే ముద్ర వేసుకున్నారు. బాల్యం నుంచి దూకుడు ప్రదర్శిస్తూ, సంచలనాలంటే ఇష్టపడే డొనాల్డ్ ట్రంప్ ఎన్నో అవరోధాలను అధిగమించారు. నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ, ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నదే చేయాలన్న పట్టుదల చూపుతూ వచ్చిన ఈయన చిరకాల వాంఛను నిజం చేసుకుంటూ, అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్నారు.

అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, వైట్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం...

1/15 Pages

1. బాల్యం ఎలా గడిచిందంటే...


జూన్ 14, 1946న ఫ్రెడ్ ట్రంప్- మేరీ అన్నా మెక్ లాయిడ్ దంపతులకు రెండో సంతానంగా డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ లో జన్మించారు. ట్రంప్ తండ్రి మూలాలు జర్మనీలో ఉంటే, తల్లి మూలాలు స్కాట్లాండ్ లో ఉన్నాయి. ఈ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. ట్రంప్ బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్క్ లోనే పూర్తయ్యాయి. ట్రంప్ కుటుంబం జమైకా ఎస్టేట్స్ లో ఉన్నప్పుడు క్యూ ఫారెస్ట్ స్కూల్లో చదువుకునేవారు. అయితే కొన్ని సమస్యల కారణంగా 13వ ఏటే ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చేరారు. అక్కడే హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తర్వాత బ్రోనెక్స్ లోని ఫార్డమ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్లు చదివారు. అనంతరం అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్ లూన్ స్కూల్ నుంచి ఆయన ఎకనామిక్స్ లో డిగ్రీ చేసారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్ లో పని చేసేందుకే ఇక్కడ చదివారు. ట్రంప్ సోదరుడు 1981లో మద్యానికి బానిసై మృతి చెందారు. ఇదే తనను మద్యం, ధూమపానం నుంచి దూరంగా ఉంచిందని ట్రంప్ తరచూ చెబుతుంటారు.

English summary

Shocking facts about Donald Trump