ముఖేష్ అంబాని భవంతి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే

Shocking facts about Mukesh Ambani House

01:21 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Shocking facts about Mukesh Ambani House

సెలబ్రిటీల ఇళ్ళ గురించి వింటున్నాం ... కానీ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంభాని కొత్తగా నిర్మించు కున్న ఇల్లు గురించి వెంటే గుండె గుభేల్ మంటుంది. ఈ బహుళ అంతస్థుల భవనం కట్టడానికి ఏకంగా 7 సంవత్సరాలు పట్టింది. కానీ ఇది వాళ్ళ దృష్టిలో చిన్నదే. మరి ఈ చిన్న భవనం ఆయన జీవిత బాగస్వామి పుట్టిన రోజు కానుక అట. ఈ భవంతి యొక్క మొత్తం విస్తీర్ణం 4 లక్షల చ. అడుగులు మరి. మొత్తం 27 అంతస్థులు గా వుంటే ఈ భవంతిలో 600 గదులు వున్నాయట. ఇక్కడ పనిచేయడానికి 600 మంది పనివాళ్లు వున్నారట. 9 లిఫ్ట్లు,3 హెలి పేడ్స్ ఏర్పాటు చేసారు. అన్నట్టు ఏకంగా ఓ సినిమా హాల్ కూడా అందులో నిర్మించేసారు. ఓ వ్యయామ శాల, ఒక ఉద్యానవనం, 168 నాలుగు చక్రాల వాహనాలు పార్కింగ్ కి అనువైన ప్రదేశం కూడా వున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ఇల్లు గా చెప్పుకునే ఈ భవంతికి మొత్తం రూ.4700/- కోట్ల రూపాయలు వెచ్చించారట. ఈ మధ్య కాలంలోనే ఈ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. మొత్తం ముగ్గురు పిల్లలు, ఆయన జీవిత బాగస్వామి ఈ భవంతిలో వుంటారు. ఇంద్ర భవనం లాంటి ఈ భవంతిలో మొదటి నెల కరంటు బిల్లు 71 లక్షలు వచ్చిందట. అదండీ సంగతి.

English summary

Shocking facts about Mukesh Ambani's House