ఈ మొక్క పేరుకే వయ్యారి భామ... కానీ ప్రాణాలు తీసే విషం..

Shocking facts about Vayyari Bhama plant

12:33 PM ON 19th October, 2016 By Mirchi Vilas

Shocking facts about Vayyari Bhama plant

పేరుగొప్ప ఊరు దిబ్బ అనే సామెత వినే వుంటారు. సరిగ్గా దీనికి అది కూడా సరిపోదు. పైగా ప్రమాదకరం కూడా. దీని పేరు వయ్యారి భామ.. పేరు ముచ్చటగా ఉన్నా, దీనిపేరు వింటే రైతులు మాత్రం హడలిపోతారు. సుమారు 3 కి.మీల మేర గాలిలో ఈ మొక్క విత్తనాలు వ్యాపిస్తాయి. ఇంత వేగంగా అల్లుకపోయే మొక్క మరేదీ లేదని చెప్పవచ్చు. పంట పొలంలో వయ్యారి భామ మొలిచిందంటే దిగుబడి తగ్గిపోతుంది. పాడి పశువులకు, మనుషులకు హానికరంగా తయారవుతుంది. జిల్లాలో ఇది సమస్యాత్మకంగా తయారైందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.

నిలవెల్ల విషం కలిగిన వయ్యారిభామ శాస్త్రీయ నామం పార్థీనీయం హిస్టొరోఫోరెస్. రైతులే కాదు, వ్యవసాయ వేత్తలు కూడా ఈ పేరు వినగానే జలదరించిపోతారు.

1/8 Pages

ఇంతకీ మన దేశంలోకి ఎలా వచ్చిందంటే...


వయ్యారిభామ మొక్క ప్రస్థానం తొలుత అమెరికాలోని ఉష్ణ ప్రాంతంలో మొదలైంది. అలా మన దేశానికి ఆహార ధాన్యాలతోపాటు 1956లో దిగుమతి అయింది. ఆ తర్వాత 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కనుగొన్నారు. వయ్యారిభామ విత్తనాలు 3 కి.మీల వరకు గాలిలో విస్తరిస్తాయి.

English summary

Shocking facts about Vayyari Bhama plant