ఈ లేడీ సింగర్ ఆదాయం తెలిస్తే దిమ్మతిరిగుద్ది!

Shocking income for pop singer Taylor Swift

11:08 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Shocking income for pop singer Taylor Swift

నిజం, ఆ సింగర్ ఆదాయం ఎంతో తెలిస్తే గుండెలదిరిపోవడం ఖాయం. ఎందుకంటే, 2016లో అత్యధిక ఆదాయం అందుకుంటున్నలేడీ సింగర్ గా హాలీవుడ్ సింగర్ టైలర్ స్విఫ్ట్ రికార్డు సృష్టించింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం 170 మిలియన్ డాలర్లు(రూ.1133 కోట్లు) తీసుకుంటూ ఏకైక మహిళా సింగర్ గా ఆమె రికార్డులకెక్కింది. గతంలో ఈ రికార్డు పాప్ స్టార్ కేటీ ప్రెట్టీ పేరిట ఉంది. 1989 వరల్డ్ టూర్ ఆల్బం నుంచే అమెకు అత్యధిక ఆదాయం అందుతోంది. రోలింగ్ స్టోన్స్ రికార్డును ఇది తిరగరాసింది. 250 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఫోర్బ్స్ జాబితాలో స్విఫ్ట్ తర్వాతి స్థానంలో మరో సింగర్ అడెలె నిలిచింది. ఆమె ఆల్బం 25 వార్షిక ఆదాయంలో రికార్డులు నెలకొల్పింది.

మూడో స్థానంలో మడొన్నా నిలిచింది. ఇటీవలి ఆమె రెబల్ హార్ట్ టూర్ 170 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 75 మిలియన్ డాలర్లతో రిహానా, 54 మిలియన్ డాలర్లతో బేయాన్స్ వరుసగా నాలుగైదు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత పెర్రీ, జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్, షనియా ట్వైన్, సెలిన్ డియాన్ నిలిచారు. దేనికైనా పెట్టిపుట్టాలని అంటారు కదా. అలాంటి వాళ్ళకే ఇలా దశ తిరుగుతుందని పలువురు నెటిజన్లు అంటున్నారు.

English summary

Shocking income for pop singer Taylor Swift