కెమెరా ను కసి తీరా నమిలేసింది

Shocking lions eats camera

11:40 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Shocking lions eats camera

ఇది ఓ కసి తీరా చేసిన పని. వివరాల్లోకి వెళ్లాల్సిందే. అది కెన్యాలోని మసాయ్ మారా నేషనల్ పార్కు. అక్కడ తచ్చాడుతున్న సింహాలను చూసిన ఓ ఫోటోగ్రాఫర్ వాటిని చూసి ముచ్చట పడి వాటి ఫోటోలు తీయాలనుకున్నాడు. సుమారు లక్ష రూపాయల విలువైన కెమెరాను ట్రై పాడ్ కు అమర్చి దూరంగా నిలబడి రిమోట్ ద్వారా సింహాల ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఇంతలోనే కెమెరాను చూసిన ఆడ సింహాల్లో ఒకటి దాని దగ్గరగా వచ్చింది.

అది తినే వస్తువనుకుందో..మరేమనుకుందో గానీ.నోట్లో పెట్టుకుని కరకరా నమిలేసింది. దీంతో ఆ కెమెరా లోని అత్యంత ముఖ్యమైన లెన్స్, ముందు భాగం డ్యామేజ్ అయి కేవలం డబ్బా మాత్రమే మిగిలింది. థామస్ సేలిజ్ అనే ఫోటోగ్రాఫర్ కు కలిగిన దుస్థితి ఇది. ఈ ఆడ సింహం ఆగడం చూసి అతనికి నోట మాట రాలేదు.

సుమారు గంట సేపు సాగిన ఈ యవ్వారంలో అతని కెమెరా నుజ్జు నుజ్జు అయింది. చివరకు సింహాలకు బోర్ కొట్టి కెమెరాను వదిలేసరికి బతుకుజీవుడా అనుకుంటూ, కేవలం శకలంగా మిగిలిన డబ్బాతో బిక్క ముఖం వేసుకుని థామస్ ఎలాగోలా బయటపడ్డాడు. కెన్యా మసాయ్ మారా నేషనల్ పార్కులో ఇలాంటివి మామూలే అనుకుంటూ అందరూ నవ్వేసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: వావ్ నానికి ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్

ఇది కూడా చూడండి: అందుకా ఈ అమ్మాయి గోవా చెక్కేసింది?

ఇది కూడా చూడండి: మాజీ మోడల్ సంగీత ఆస్తుల సీజ్

English summary

Shocking news curious lions eats camera.