భర్త ఆఫీస్ కి వెళ్ళగానే ఆమె ఏం చేసిందో తెలుసా(వీడియో)

Shocking Mother is beating her baby son

11:30 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Shocking Mother is beating her baby son

అందుకే అన్నారు మనవాళ్ళు ‘‘అత్తపై ఉన్న కోపం దుత్తపై చూపిం చిందని.. " సరిగ్గా అదే నిర్వాకం చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ. నవమాసాలు మోసి కన్న కొడుకును అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లే తరచూ హిసించింది. ఇది కాస్తా సీసీకెమేరాకు చిక్కడంతో ఈ ఘటన దేశంలోనే సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన పూనం అనే మహిళ భర్తపై ఉన్న కోపం తన చిన్నారి కొడుకుపై ప్రదర్శించింది. ప్రతినిత్యం చిన్నారి కొడుకును తిడుతూ, కొడుతూ పైశాచిక అనందాన్ని పొందింది. కొడుకును దారుణంగా కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగుచూశాయి.తనపై కోపంతో భార్య పూనం, ప్రతిరోజూ కొడుకును కొడుతుండటంతో భర్త దీపక్ చతుర్వేది భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమేరాలు పెట్టాడు. అంతే కొడుకును అత్యంత దారుణంగా కొట్టిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. భర్త దీపక్ చతుర్వేది ఈ సీసీటీవీ ఫుటేజ్ ను ఇరుగుపొరుగువారితోపాటు స్థానిక విలేఖరులకు చూపించారు.

పూనం నాలుగేళ్ల దాకా బాగానే ఉందని, బిడ్డ పుట్టాక ఏడాదిన్నర కాలం నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని భర్త దీపక్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో తాను భార్య పూనంకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతానని దీపక్ చెప్పారు.

కాగా భర్త దీపక్ తనను వరకట్నం తెమ్మని డిమాండు చేస్తున్నాడని భార్య పూనం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పూనం తన బిడ్డతో సహా పుట్టింట్లో ఉంటోంది. అయితే కొడుకుని కొట్టిన భార్యపై చర్యలు తీసుకొని తన కుమారుడిని అప్పగించాలని భర్త దీపక్ వేడుకున్నాడు. ఈ కేసు ఎటు దారితీస్తుందో మరి.

ఇది కూడా చూడండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

English summary

Shocking and sad moment placed in Uttar pradesh. Mother is beating her son. Suspicious husband install security cameras in their house.