ఈ మొక్క తిరగడం చూస్తే షాకవుతారు

Shocking Neem Tree Moving Automatically

11:37 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Shocking Neem Tree Moving Automatically

అక్కడక్కడా అప్పుడప్పుడు వింతలూ విశేషాలూ చోటుచేసుకోవడం, వాటిని చూసి ప్రజలు ఆశ్చర్య పోవడం చూస్తుంటాం. అలాగే, గాలికి మొక్కలు అటూ ఇటూ తిరగడం సహజం కానీ, అసలు గాలి వీచకుండానే ఓ చిన్నమొక్క దానంతట అదే అటూఇటూ కదులుతుండటం సెన్సేషన్ గా మారిన సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వెలుగుచూసింది. క్రాంతినగర్ లోని ఇంటి ఆవరణలో మొలిచిన వేప చెట్టు దానంతట అదే అటూఇటూ తిరిగేస్తోంది. దీనిని మొదట గమనించిన యజమాని గాలికి తిరుగుతుందనుకున్నాడు. కానీ, గాలి లేకున్నా , వేప మొక్క అటూ ఇటూ తిరుగుతుందటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ సంఘటన ఆ నోటా ఈనోటా బయటకు పొక్కడంతో జనం వచ్చి ఈ వింతను చూసి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇక వీడియో తీసి, పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా మిశ్రమ స్పందన వ్యక్తంచేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

English summary

Shocking Neem Tree Moving Automatically