బాడీ బిల్డర్లకు దిమ్మతిరిగే వార్త!

Shocking news for body builders

11:21 AM ON 5th November, 2016 By Mirchi Vilas

Shocking news for body builders

కొందరు విపరీతంగా వ్యాయామం చేసేస్తూ, బాడీ బిల్డర్స్ గా రాణిస్తుంటారు. ఇన్నాళ్లూ ఏమో గానీ ఇప్పుడు మాత్రం బాడీ బిల్డర్లకు షాక్ కలిగించే వార్త ఒకటి తాజా అధ్యయనంలో తేలింది. మజిల్ సైజును పెంచినంత మాత్రాన వారు బలమైన అథ్లెట్లు అయిపోరట. ఆ అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. మజిల్ సైజుకు, మజిల్ బలానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని అమెరికాలోని మిస్సిస్సిపి యూనివర్సిటీ పేర్కొంది. కండరాల పరిమాణం, కండరాల బలం రెండూ వేర్వేరు అంశాలని అధ్యయనకారులు స్పష్టం చేసారు. ఎటువంటి వ్యాయామం చేస్తున్నామనే దానిపైనా అది ఆధారపడి ఉంటుందన్నారు.

కండరాల పరిమాణాన్ని, కండర బలాన్ని పెంచడం మధ్య బలహీనమైన సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి వ్యాయామాలతో కూడా మజిల్ సైజును పెంచవచ్చని, కానీ మజిల్ బలాన్ని పెంచాలంటే మాత్రం అది సరిపోదని వారు వివరించారు. కాబట్టి కండరాలను పెంచినంత మాత్రాన దృఢంగా ఉన్నామనుకోవడం పొరపాటేనని అధ్యయనకారులు తేల్చేయడంతో, బాడీ బిల్డర్స్ అవాక్కవుతున్నారు.

English summary

Shocking news for body builders