జియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్!

Shocking news for Jio users

12:19 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Shocking news for Jio users

ఎనౌన్స్ చేసిన తక్కువ రోజుల్లోనే రిలయన్స్ జియో అనూహ్య రికార్డులు సొంతం చేసుకుంది. అయితే జియో వినియోగదారులకు మాత్రం షాకయ్యే న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ట్రాయ్ వెబ్ సైట్ లోని తాజా నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో 4జీ వేగం చాలా దారుణంగా ఉంది. ముఖ్యమైన ఐదు కంపెనీల 4జీ వేగంతో పోలిస్తే అత్యంత నెమ్మదిగా ఉంది. ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ కంటే కూడా నెమ్మదిగా ఉన్నట్టు ట్రాయ్ పరిశోధనలో తేలింది. ఎయిర్ టెల్ 4జీ స్పీడ్ 11.4 మెగాబైట్స్ పర్ సెకండ్(ఎంబీపీఎస్) కాగా, అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ 7.9 ఎంబీపీఎస్, ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.3 ఎంబీపీఎస్ వేగం కాగా ముకేష్ అంబానీ రిలయన్స్ జియో వేగం కేవలం 6.2 ఎంబీపీఎస్ లేనని ట్రాయ్ అనలిటిక్స్ పోర్టల్ పేర్కొంది.

కాగా తమ 4జీ నెట్ వర్క్ వేగం చాలా తక్కువ అన్న ట్రాయ్ అనలిటిక్స్ ను జియో ఖండించింది. అది పూర్తిగా పక్షపాతంతో కూడిన సర్వే అని పేర్కొంది. మరి జియో ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary

Shocking news for Jio users