దేవి కేసు రిమాండ్‌ రిపోర్ట్‌ లో షాకింగ్ న్యూస్

Shocking News In Devi Reddy Death Case

03:28 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Shocking News In Devi Reddy Death Case

ఇప్పటికే సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థిని దేవి మృతి యాక్సిడెంట్ వల్ల జరిగిందే అని పోలీసులు నిర్దారణకు వచ్చినప్పటికీ, ఈ కేసుకు సంబంధించి అనేక సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. దేవి ఫ్రెండ్ భరత్‌సింహారెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు కోర్టును కోరారు. అయితే, కౌంటర్‌ దాఖలుకు మంగళవారం వరకూ గడువు కావాలని భరత్‌ అడ్వొకేట్‌ కోర్టును అభ్యర్ధించారు. కాగా, కారు యాక్సిడెంట్ కు గురైన సమయంలో భరత్‌ మద్యం తాగి ఉనట్టు పోలీసులు ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:బన్నీకి పవర్ స్టార్ ఫ్యాన్స్ వార్నింగ్?

డ్రంకన్‌ టెస్ట్‌లో 142 mg/100ml ఆల్కహాల్‌ ఉన్నట్టు నిర్ధారించిన పోలీసులు, ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల చనిపోతారని తెలిసినా కావాలనే రాష్ డ్రైవ్‌ చేశాడని పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో భరత్‌పై 304 (ఎ), 304 పార్ట్‌ (2) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ విచారణలో భరత్ వెల్లడించిన సమాచారం ప్రకారం, భరత్‌-దేవిల మధ్య ఫేస్‌బుక్‌లో రెండేళ్ల నుంచి పరిచయం ఉందని, 8 నెలల క్రితం మాదాపూర్‌లోని ఓ పబ్‌లో తొలిసారి కలుసుకున్నట్టు భరత్‌ పోలీస్ విచారణలో వెల్లడించాడు. ఎంక్వైరీలో భాగంగా భరత్‌, దేవి, స్నేహితుల వాట్సాప్‌ మెసేజ్‌లు, కాల్‌ డేటాను పోలీసులు విశ్లేషించారు. కారులో మూడో వ్యక్తి లేడని దర్యాప్తులో తేల్చిన పోలీసులు, బలమైన దెబ్బలు, తలకు తీవ్రగాయం వల్లే దేవిరెడ్డి మృతిచెందినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో తేల్చారు. ఇంకా ఈ కేసులో ఎలాంటి నిజాలు బయట పడతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

ఇవి కూడా చదవండి:గ్యాంగ్‌లీడర్ రీమేక్ కి రెడీయా?

English summary

A Shocking news came to know in Engineering Student Devi Reddy death case in Hyderabad. Postmortem report confirmed that she was died because of accident. Police filed case on Bharath Simha Redyy for driving car by Drinking Alcohol.